IAS Officer: ఆ మాజీ ఐఏఎస్ అవినీతి చరిత్ర అంతా ఇంతా కాదన్న రేవంత్!ఎవరాయన? ఏమిటా కథా కమామిషు!?
కలెక్టర్ గా ఉంటూనే ముఖ్యమంత్రి కెసిఆర్ కాళ్లపై బహిరంగ సభలో పడిన వెంకట్రామిరెడ్డి గురించి తెలంగాణా లో కథలు కథలుగా చెప్పుకుంటారు.అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ మనోభావాలకు అనుగుణంగా ఆయన వరి రైతులను కూడా కలెక్టర్ హోదాలో బెదిరించిన వైనం చరిత్ర కెక్కింది.కాగా ఇవన్నీ తెలంగాణాకు పరిమితమైన కథనాలు అయితే వెంకట్రామిరెడ్డికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకూడా గొప్ప చరిత్ర ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.ఆయన అత్యంత అవినీతిపరుడైన అధికారి అన్నారు.
రేవంత్ చెప్పిందేమిటంటే?
వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రులను మెప్పించి ఉన్నత పదవులు పొందడంలో అందెవేసిన చేయి అని చెప్పారు.అంతేగాక టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన అధికారి అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వెంకట్రామిరెడ్డి చిత్తూరు జిల్లాలో ఉన్నతాధికారి గా ఉన్న తరుణంలో తాగునీటి పథకాలకు సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని చెప్పారు.అప్పట్లో వెంకట్రామిరెడ్డి మీద టీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరైన హరీష్ రావు అనేక అవినీతి ఆరోపణలు చేశారని తెలిపారు.
రాష్ట్రపతి ఆదేశించినా చర్యలు లేవు!
ఇక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా వెంకట్రామిరెడ్డిపై నేరుగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని,దీంతో రాష్ట్రపతి కార్యాలయం స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ సెక్రటరీని ఆదేశించినా ఆ ఫైల్ అటకెక్కిందన్నారు.వెంకట్రామిరెడ్డిపై కోర్టు ధిక్కారణ కేసులు కూడా ఉన్నాయని తెలిపారు.వెంకట్రామిరెడ్డికి చెందిన రాజపుష్పా సంస్థ వెయ్యి కోట్ల రూపాయల కోకాపేట భూముల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు అయితే టీఆర్ఎస్ కార్యకర్త మాదిరి, సిఎం కెసిఆర్ కి బంట్రోతు లాగ వ్యవహరించి వెంకట్రామిరెడ్డి అన్నింటి నుండి బయటపడి ఎమ్మెల్సీ అయిపోయారన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యవహారాన్ని అంత సులువుగా వదిలిపెట్టబోదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
No comments:
Post a Comment