కేరళ సర్కారు తీరుపై విమర్శలు – దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న కార్టూన్ కు బహుమతి
కేరళ లలితకళా అకాడమీ 2019-2020 సంవత్సరానికిగానూ కార్టూన్ల పోటీ నిర్వహించింది. అందులో అనూప్ రాధాకృష్ణన్ వేసిన కార్టూన్ ను గౌరవప్రదమైన కార్టూన్ గా ఎంపిక చేసింది. కోవిడ్ ను నియంత్రించడంలో భారత్ విఫలమైంది అన్న అర్థం వచ్చేలా కార్టూన్ ఉంటుంది. అమెరికా, ఇంగ్లాండ్, చైనా , భారత్ ప్రతినిధులు పక్కపక్కనే కూర్చొని కోవిడ్ 19పై ప్రపంచ వైద్య శిఖరాగ్ర సమావేశాన్నినిర్వహిస్తున్నట్టు కార్టూన్ వర్ణిస్తుంది. అందులో భారత ప్రతినిధిని నారింజ రంగు శాలువా కప్పుకున్న ఆవులా చూపించారు. దేశంలో 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును అధిగమించి మహమ్మారిని ఎదుర్కోవడంలో ముందున్న మన దేశాన్ని మనమే తక్కువ చేసినట్టు ఆ కార్టూన్ ఉంది.
ఏ కార్టూన్ ఏం చెబుతోందనే సోయి ప్రభుత్వానికి లేదా అని సురేంద్రన్ నిలదీశారు. ఒకటికిరెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అయితే కార్డూన్ ను ప్రముఖులతో కూడిన జ్యూరీ ఎంపిక చేసిందని అందులో తన పాత్రేంలేదని అకాడమీ చైర్మన్ నేమం పుష్పరాజ్ అంటున్నారు. వలపాడ్ కు చెందిన దిన్ రాజ్ వేసిన రాజా అండ్ మహారాజా కార్టూన్ కు అత్యుత్తమ కార్టూన్ గా ఎంపిక చేసి 25 వేల నగదును, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. రాధాకృష్ణన్ అనే వ్యక్తి వేసిన ఈ కార్టూన్ తో పాటు రతీష్ రవి వేసిన కార్టూన్ లను హానరబుల్ కార్టూన్లుగా ఎంపిక చేశారు.
No comments:
Post a Comment