మానవ హక్కుల వేదిక
HUMAN RIGHTS FORUM
పత్రిక ప్రకటన
హైదరాబాద్ లో నవ్య ముద్రణాలయం పై పోలీసుల దాడి చట్ట విరుధ్ధమైన చర్య
హైదరాబాద్ లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు దాడి చేసి ముద్రణలో ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకోవడం ఏ రకంగా చూసినా చట్టవిరుద్ధమైన చర్య. తెలంగాణ పబ్లిక్ సెక్యురిటి చట్టం కింద ప్రెస్ యజమాని రామకృష్ణ రెడ్డి మరియు ఆయన సతీమణి సంధ్య గార్ల పై కేస్ పెట్టడం కూడా పోలీసుల అత్యుత్సాహక చర్యనే. మనం బతుకుతున్నది, ప్రాథమిక హక్కులను సమున్నతనంగా నిలబెట్టే రాజ్యాంగం అమలు అవుతున్న నాగరిక సమాజం లోనేనా అనే సందేహం వస్తోంది. పుస్తకాలను ముద్రించడం ఏ చట్టం ప్రకారం నేరం? పోలీసుల చట్ట విరుద్ధ చర్యలను మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది?
ఒక నిషిద్ధ పార్టీలో సభ్యత్వం కలిగి ఉంటే చట్ట ఉల్లంఘన అయితే కావచ్చు కానీ చనిపోయిన తరువాత కూడా ఆ వ్యక్తిని చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వ్యక్తి లా పరిగణించాలని చట్టం ఎక్కడా అనదే. మరి పోలీసులకు చట్టం అలా ఎందుకు అర్థం అవుతున్నదో? ఒక పుస్తకం ముద్రణ పూర్తి చేసికుని బయటకు వచ్చిన తర్వాత పుస్తకంలోనో విషయాన్ని బట్టి అది నిషేధార్హమా కాదా అని తేల్చాలి కానీ ముద్రణలో ఉండాగానే పోలీసులు ఎలా నిర్ధరిస్తారు?
తెలంగాణా పోలీసుల విచిత్ర ప్రవర్తనకు, చట్ట విరుద్ధ చర్యలకు నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై నిన్న , 12.11.2021 న ,చేసిన దాడి తాజా చేర్పు. రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించే ఇలాంటి చర్యలను తెలంగాణా పోలీసులు ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది.
పోలీసుల చర్య భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడి గా మా సంస్థ భావిస్తుంది. ప్రజలకు గల సమాచార హక్కుపై దాడి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్య. పోలీసులు నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై చేసిన దాడి ని మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది.
13 నవంబర్ 2021
హైదరాబాద్
ఎస్. జీవన్ కుమార్,
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయ కమిటీ,
మానవ హక్కుల వేదిక
గొర్రెపాటి మాధవరావు
అధ్యక్షుడు,
మానవ హక్కుల వేదిక
తెలంగాణ రాష్ట్ర కమిటీ
డాక్టర్ ఎస్. డాక్టర్. తిరుపతయ్య,
ప్రధాన కార్యదర్శి
మానవ హక్కుల వేదిక
తెలంగాణ రాష్ట్ర కమిటీ
తెలంగాణ
No comments:
Post a Comment