ప్రెస్ నోట్
(తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్)
Date:15/11/2021
సమగ్ర భూ సర్వే జరపకుండా
భూమల లో ఉన్న సమస్యలు గుర్తించకుండా గుడ్డిగా
ధరణి పోర్టల్ ఎందుకు తెచ్చారు సమర్థత లేని సాప్ట్ వెర్ కంపెనీకి ధరణి పోర్టల్ బాధ్యత ఎందుకు అప్పగించారు
తెలంగాణ భూముల పైన అవగాహన లేని CS సోమేష్ కుమార్ గారికి కీలక బాధ్యత ఏ అర్హత ప్రకారం ఇచ్చారు
ధరణి పోర్టల్ వచ్చి 14 నెలలు గడిచినా ఒకే సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రవేట్ భూమిని ఎందుకు విబజించ లేకపోయారు మొత్తం భూమిని బ్లాక్ చేయడం ఏమిటి హద్దులు నిర్ణయించ లేని అసమర్థ అధికారులతో సమస్యలు పరిష్కారం కావడానికి ఇంకా ఎన్ని సం" రాలు లక్షల మంది రైతులు ఎదురు చూడాలి శ్రీ పేర 3లక్షల ఎకరాలు ధరణి లో నమోదు అయింది శ్రీ ఆడ న మొగ నా ఎవ్వరు ఈ భూ మాత ఈ భూమి ఎవ్వరికి కట్ట బెడుతారు
కొన్ని సర్వే నెంబర్ లలో యెక్కువ లేదా తక్కువ నమోదు అయి ఉన్న భూ విస్తీర్ణానికి పరిష్కారం యెట్లా చూపిస్తారు
మ్యాన్వల్ గా భూముల వివరాలు నమోదు చేయ కుంటే ధరణి పోర్టల్ లో కొన్ని రికార్డ్ లు మాయం అయితే బాధ్యత ఎవ్వరిది,
లక్షల మంది రైతుల ను భాధ పెడుతున్న ధరణి పోర్టల్ మొదటి బర్త్ డే అధికారులు కేకులు కట్ చేసి పైచాచిక ఆనందం పొందటం ఏంది? ఈ సాంప్రదాయము ఉన్నదా?
నాలా కన్వర్షన్ కాని భూమిని కూడా నాల కింద చూపించడం వలన రైతులకు రావలసిన బెన్పిట్స్ ప్రభుత్వం నుండి అందడం లేదు వారి పరిస్థితి ఏమిటి
వివిధ కారణాల వలన
ప్రభుత్వం నుండి పట్టా పాష్ బుక్ లు ఉండి సర్వ హక్కులు ఉన్న ప్రభుత్వ భూమిని వారి వారసులకు మార్చు కునె అవకాశం ధరణి పోర్టల్ లో లేదు
ప్రభుత్వ భూముల కు ప్రవేట్ సర్వే నెంబర్ లు వేసుకొని అన్ని హక్కులు అనుభవిస్తూ ప్రభుత్వ భూమిని ఆధీనం లో ఉంచుకున్న వారి భూమిని ఏమీ చేస్తారు అట్లాంటి భూమి ఎన్ని లక్షల ఎకరాలు ఉంటుంది
వీలైనప్పుడల్లా ధరణి ఒక విప్లవం అని అద్బుతం అని ముఖ్య మంత్రి గారు, CS గారు చెప్పడం లో అర్ధం ఏమిటి సమస్యలు తెలియని అంధకారం లో ఉన్నారా?
సాదా బైనామా ఉండి కొన్ని సం"రాల క్రితం కొనుక్కొని భూమి దున్ను కుంటూ ఉన్న రైతుల హక్కులను హరించి పాత ఏజ మానులకు దరణిలో హక్కులు కలిపించడం న్యాయమా? కొత్త తగువులు ప్రభుత్వం సృష్టించినట్లు కాదా?
1985 లోనే ప్లాట్స్ గా విబజించ బడి పలు మార్లు రిజిష్టర్ అయి LRS ఉన్న భూములకు నాల కన్వర్షన్ కాలేదనే నెపంతో పాత యేజమానుల పేర దరణిలో నమోదు చేసి వారికి హక్కులు ఇవ్వడం వలన ప్లాట్స్ కొన్న ప్రజలు నస్ట్టపోరా? మరీ ఇంత చెండాలంగా అధికారులు లంచాలు తీసుకొని ఇలాంటి పని చేస్తుంటే పర్యవేక్షణ ఏది?
పొర పాటున ఒకరి భూమి మరొకరి పేర ధరణీ లో లంచవతారాలు అయిన అధికారులు నమోదు చేస్తే తిరిగి అసలైన యేజమాని రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి చేసుకోవాలా? అవతలి వ్యక్తి చేయను అంటే పరిస్థితి ఏమిటి? వారు ఇతరులకు అమ్ముకున్న సందర్భం కూడా ఉంది కదా?
ధరణి లో
పది లక్షల శ్లాట్లు బుక్ అయ్యాయి
ఆదాయం వచ్చింది అని గొప్పలు చెప్పుకోవడానికి చూస్తే నవ్వొస్తంది క్రయ విక్రయాలు జరిగినప్పుడు స్లాట్ లు బుక్ అవుతాయి రిజిస్ట్రేషన్ లు జరిగినప్పుడు ప్రభుత్వానికి సహజంగా ఆదాయం వస్తుంది ఇందులో ధరణి గొప్పేంటి సాధించింది ఏమిటి మామూలుగా సబ్ రిజిస్ట్రార్ ఆపీస్ లో కూడా జరిగేవి సమస్యలు ధరణి పోర్టల్ సమస్యలు సృష్టించ కుంటే ఇంకా యెక్కువ జరిగేవి
ఇట్లా చెప్పుకుంటూ పోతే చాట భారతం అంత సమస్యలు ధరణి లో ఉన్నాయి
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్
నారగొని ప్రవీణ్ కుమార్
9849040195
No comments:
Post a Comment