Friday, November 26, 2021

ఉద్దేశపూర్వక దాడుల నుంచి.. న్యాయవ్యవస్థను రక్షించండి!


ఉద్దేశపూర్వక దాడుల నుంచి.. న్యాయవ్యవస్థను రక్షించండి!

  • సత్యం వైపునే నిలబడండి.. తప్పులను ఖండించండి
  • రాజ్యాంగ మూల సూత్రాలు ప్రజా సంక్షేమం కోసమే
  • రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థది కీలకపాత్ర
  • ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించండి
  • రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లాయర్లకు సీజేఐ ఉద్బోధ

సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. భారత రాజ్యాంగం ఎంతో ఉన్నతమైనదన్న ఆయన.. రాజ్యాంగ సూత్రాలు దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమేనని గుర్తు చేశారు. ప్రజల బాగు కోసమే కేసులను వాదించాలని, తద్వారా ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంపొందించాలని న్యాయవాదులకు సూచించారు. సమాజ అభ్యున్నతి కోసం పౌరులకు తమ బాధ్యతల పట్ల అవగాహన కల్పించడానికి న్యాయవాదులు కార్యోణ్ముఖులు కావాలన్నారు.

అంకితభావం ఉంటేనే కొనసాగగలం

న్యాయవాద వృత్తి ఎంతో ఉన్నతమైనదని పేర్కొన్న సీజేఐ.. నైపుణ్యం, అనుభవం, అంకితభావం ఉంటేనే ఈ వృత్తిలో కొనసాగగలమని చెప్పారు. మిగతా వృత్తులకు ఇది ఎంతో భిన్నమైనదన్నారు. పౌర ధర్మం, సమగ్రత, సామాజిక సమస్యలపట్ల అవగాహన, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్లే ఈ వృత్తిలో ఉండగలరని తెలిపారు. సమాజానికి నాయకులుగా, దిశా నిర్దేశం చేసే గురువుల్లాగా న్యాయవాదులు ప్రవర్తించాలన్నారు. న్యాయవాదవృత్తిలో 50 ఏండ్లు పూర్తిచేసుకున్న ఐదుగురు న్యాయవాదులకు సీజేఐ అభినందనలు తెలిపారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్‌ భవన్‌లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో జస్టిస్‌ రమణ పాల్గొన్నారు.

జాతి ప్రయోజనాల కోసం కృషిచేయాలి: రాష్ట్రపతి కోవింద్‌

అధికార, ప్రతిపక్షంతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ఎంపీలు ప్రజా సంక్షేమం కోస మే కృషిచేయాలని రాష్ట్రపతి కోవింద్‌ పిలుపునిచ్చారు. సమర్థమైన ప్రతిపక్షంలేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదన్నారు. పార్టీలు శతృత్వాన్ని విడిచిపెట్టి జాతి ప్రయోజనాల కోసం పనిచేయాలన్నారు. పార్లమెం ట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి: మోదీ

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారసత్వ పార్టీల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శించారు. ఈమేరకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ సహా 15 విపక్ష పార్టీలు హాజరుకాలేదు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధంలేని ఇలాంటి కార్యక్రమాలను ప్రతిపక్షాలు బాయ్‌కాట్‌ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

No comments:

Post a Comment