హైదరాబాద్ : 15/02/2021
GHMC మేయర్ మేడం గారు మీకు పదవి ఇచ్చింది నగరం అభివృద్ధి చేయడానికి.ఇట్లా కక్షపూరితంగా తహశీల్దార్ ను బదిలీ చేయించుకోవడానికి కాదు *గౌరవనీయులైన మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి మేడం గారు....*
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్‌గా తెరాస సీనియర్ నాయకులు పెద్దలు కే.కేశవరావు కూతురు శ్రీమతి గద్వాల విజయలక్ష్మి మేడం గారిని పార్టీ అధిష్టానం ఫిబ్రవరి 11న సీల్డ్ కవర్ రూపంలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.అదే రోజున కార్పోరేటర్లతో పాటు మేడం గారు కూడా నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.అయితే, విజయలక్ష్మి మేడం గారిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించకముందు కొన్ని అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నాయి.కుల ధృవీకరణ పత్రం విషయంలో గత నెల షేక్‌పేట తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డితో మేడం గారికి వాగ్వాదం జరిగింది.
*తీరా సీన్ కట్‌చేస్తే..*
*షేక్‌పేట్ తహశీల్దార్‌పై బదిలీ వేటు పడింది*.
ఆయన్ను సీసీఎల్‌ఏకు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మార్వో ని బదిలీ చేయించిన విజయలక్ష్మి మేడం గారు.
బంజారాహిల్స్ లో ఇష్టానుసారంగా.. కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలని గతంలో షేక్పేట్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి పై చిందులు వేసిన కార్పొరేటర్ గా వున్న విజయలక్ష్మి మేడం గారు..బండ బూతులు తిట్టడం మే కాక విధులకు ఆటంకం కలిగించారని.. కోర్టుకు వెళ్లకుండా అడ్డుకున్నారని కార్పొరేటర్ మేడం పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి..(అన్ని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా లో విశ్లేషణలు వచ్చాయి కూడా) మేయర్ పీఠం రాగానే పంతం నెగ్గించుకుని తహసీల్దార్ గారిని సీసీఎల్ కు బదిలీ చేయించిన మేయర్ విజయలక్ష్మి మేడం గారు.చట్టం ముందు అందరూ సమానులే అని నీతులు చెప్పి..ఒక్కరోజులోనే బయటపడ్డ బండారం...విజయలక్ష్మి మేడం గారి తీరుతో అధికారులు తీవ్ర ఆందోళన..మాట వినకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని అనుచరుల, సన్నిహితులకు సమాచారం..
అరకులోయలో బస్సు పడి మృతి చెందిన, క్షతగాత్రులైన నగరవాసులకు సేవలందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ కు తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు.మరో వైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.అయినప్పటికీ ఎలాంటి కారణం లేకుండా, పక్క రాష్ట్రంలో సేవలు అందించేందుకు వెళ్లారని కూడా మరిచి హైదరాబాద్ జిల్లా నుండి రాత్రికి రాత్రే బదిలీ చేయడం, పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదు.దీనిని తీవ్రంగా ఖండించాలి.ఇదంతా కూడా రాజకీయ బదిలీగానే కనిపిస్తుంది.ఒక్కరిద్దరు నాయకులు కక్ష్యపూరితంగా చేయించిన బదిలీగానే కనిపిస్తుంది.అకారణంగా చేసిన బదిలీని వెంటనే వెనక్కి తీసుకోవాలి.ఈ చర్య కేవలం తహసీల్దారు శ్రీనివాస్ రెడ్డి పట్ల జరిగిన బదిలీ కాదు....ఇది రాష్ట్రంలోని రెవెన్యూ వ్యవస్థ మీద జరిగిన చర్యగా భావించాలి అని ప్రజా సంకల్పం & link Media అభిప్రాయపడుతుంది.MRO శ్రీనివాస్ రెడ్డి గారికి న్యాయం జరిగేంత వరకు సమాజం సమిష్టిగా ఉద్యమించాలి....
*హైదరాబాదు లోని షేక్ పేట తహసీల్దార్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని అకారణంగా బదిలీ చేయడాన్ని ప్రజా సంకల్పం & link Media తీవ్రంగా ఖండిస్తుంది*
Note : తెలంగాణ రెవిన్యూ సంఘం ప్రతినిధులు స్పందించాలి అని ప్రజా సంకల్పం & link Media విజ్ఞప్తి చేస్తుంది.
Copy to Group link Media
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment