Saturday, February 20, 2021

ఇదేంద‌య్యా తహ‌శీల్దార్‌.. విచార‌ణ మ‌రిచారా..

హైదరాబాద్ : 20/02/2021

*ఇదేంద‌య్యా తహ‌శీల్దార్‌.. విచార‌ణ మ‌రిచారా..*

రెవెన్యూ అధికారుల లీల‌లు ఎంత చెప్పినా త‌క్కువ‌గానే ఉంటాయి.. ప్ర‌భుత్వాలు ఎన్ని సంస్క‌ర‌ణ‌లు చేసినా, అవినీతికి పాల్ప‌డే అధికారుల‌పై ఎంత వేటు వేసినా, కొంత‌మంది రెవెన్యూ అధికారుల ఆలోచ‌న‌ల్లో అస్స‌లు మార్పేరాదు.. వారి ఆలోచ‌న అంతా దోచుకోవడం మీద‌నే ఉంటుంది. అస‌లైన వారికి న్యాయం చేయ‌కుండా లంచాల‌కు క‌క్కుర్తి ప‌డుతూ బినామీల‌కు ప‌ట్టాలు చేయ‌డం ష‌రా మామూలుగానే మారిపోయింది. ఒక ప‌క్క తెలంగాణ ముఖ్య‌మంత్రి ప్ర‌క్షాళ‌న మొద‌లెట్టినా, వీరి ప‌ని వీరూ చేస్తూనే ఉన్నారు.. ఒక ఇంటి య‌జ‌మాని చ‌నిపోతే త‌న‌కు సంబంధించిన‌ వ్య‌వ‌సాయ భూమి త‌న భార్య‌కు రాయ‌కుండా మరిది పేరు మీద ఎక్కించిన మ‌హాఘ‌నుడు ములుగు జిల్లా కేంద్రం త‌హ‌శీల్దార్‌..

ములుగు జిల్లా కేంద్రానికి చెందిన సానికొమ్ము విజ‌య‌లక్ష్మి భ‌ర్త శ్రీనివాస్ రెడ్డి గ‌త సంవ‌త్స‌రం 22-11-20202 రోజున చ‌నిపోయాడు.. ఆ దంప‌తుల‌కు పిల్ల‌లు లేక‌పోవ‌డంతో భ‌ర్త పోయిన బాధ‌లో భార్య ఉంది. ఆస‌రాగా ఉన్న భ‌ర్త కాలం చేయడంతో తమ్ముడే అన్ని తానై అక్క‌ను చూసుకుంటున్నాడు. బాధ‌లో ఉన్న విజ‌య‌ల‌క్ష్మిని ఓదారుస్తూ కుటుంబస‌భ్యులు ధైర్యం చెపుతున్నారు. ఎవ‌రి బాధ‌లో వారుంటే దొంగ‌ల బాధ‌లో దొంగ‌లు ఉంటార‌నే సామెత ఇక్కడ బాగా ప‌నిచేస్తోంది.

చ‌నిపోయిన సానికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి పేరుమీద ఏడు ఎక‌రాల ముప్పై తొమ్మిది గుంట‌ల వ్య‌వ‌సాయ ప‌‌ట్టా భూమి ఉంది. ఇదే అద‌నుగా భావించిన శ్రీనివాస్‌రెడ్డి త‌మ్ముడు సానికొమ్ము వెంక‌ట‌ప్ప‌రెడ్డి వ‌దిన విజ‌య‌ల‌క్ష్మికి తెలియ‌కుండా మొత్తానికి మొత్తం త‌న పేరు మీద రాయించుకున్నాడు. క‌నీసం ప‌ట్టా చేసేముందైనా ములుగు మండ‌ల రెవెన్యూ అధికారులు దాని మీద విచార‌ణ చేసి అస‌లు భూమికి సంబంధించిన ప‌ట్టాదారుడో కాదో తెలుసుకోవాలి.. కాని అదేమి ఆలోచించ‌కుండా అమ్యామ్యాలు వ‌స్తున్నాయ‌ని తెలిసేస‌రికి ఉన్న‌దంతా ప‌ట్టా చేసి ఇచ్చారు. విష‌యం తెలిసిన విజ‌య‌లక్ష్మి మ‌రింత ఆవేద‌న‌తో త‌న త‌మ్ముడికి విష‌యం చెప్పింది. త‌మ్ముడు వెంక‌ట్‌రెడ్డి స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం ద్వారా స‌మాచారం సేక‌రించ‌డంతో మొత్తానికి మొత్తం ఏడు ఎక‌రాల ముప్పై తొమ్మిది గుంట‌ల భూమి సానికొమ్ము వెంక‌ట‌ప్ప‌రెడ్డి పేరు మీద అదీ కూడా ఈ నెల పిబ్ర‌వ‌రి 08.02.2021 రోజున ప‌ట్టా చేసిన‌ట్టు తెలిపారు.

మండ‌ల త‌హ‌శీల్దార్ విచార‌ణ చేయ‌కుండా ఏలా ఎక్కిస్తాడ‌ని, భార్య ఉండ‌గానే త‌న‌కు తెలియ‌కుండా త‌న భూమిని వేరే వాళ్ల‌కు రాసి ఇచ్చిన ములుగు త‌హ‌శీల్దార్‌పై విచార‌ణ జ‌రిపి అత‌నిపై క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ములుగు అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ ఆద‌ర్శ సుర‌భికి ఫిర్యాదు చేశారు. విచార‌ణ జ‌రిపి అందుకు బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకొని న్యాయం చేస్తామ‌ని అద‌న‌పు క‌లెక్ట‌ర్ చెప్పిన‌ట్లు విజ‌య‌ల‌క్ష్మి తెలిపారు.

@ముందడుగు మీడియా సౌజన్యంతో

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment