Friday, February 26, 2021

సాక్ష్యాల‌తో నిరూపిస్తా... కేటీఆర్ ప‌ద‌వి‌కి రాజీనామా చేస్తారా ??

హైదరాబాద్ : 26/02/2021

*Q News*

*సాక్ష్యాల‌తో నిరూపిస్తా... కేటీఆర్ ప‌ద‌వి‌కి రాజీనామా చేస్తారా?*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులను, పట్టభద్రులను మోసగించే ప్రయత్నం చేస్తోంద‌ని వ‌రంగ‌ల్-ఖ‌మ్మం-న‌ల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థి *తీన్మార్ మ‌ల్ల‌న్న* అన్నారు. ఇందులో భాగంగానే 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ చెప్పడం సిగ్గు చేటని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ అంశంపై శుక్ర‌వారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారి కార్యాలయంలో క‌లిశారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల వివరాలను గంపగుత్తగా కాకుండా ఏ గ్రామంలోని ఏ నిరుద్యోగికి ఏరోజు ఏ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారో అభ్యర్థుల పూర్తి వివరాలతో కూడిన జాబితా ఇవ్వాల్సిందిగా కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం నిజంగా 1.32 లక్షల ఉద్యోగాలు కల్పించి ఉంటే...పట్టభద్రుల ఎన్నికలలో ఎందుకు భయపడుతుందని ఆయ‌న ప్ర‌శ్నించారు. నిజంగా ఉద్యోగాలు ఇచ్చిఉంటే ఉద్యోగాలు పొందిన 1.32 లక్షల మందిని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిలబెట్టి చూపాలని ఆయ‌న డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ లు సంక్రాంతి బసవన్నల వలే సీజనల్ అబద్ధాలు చెప్పడంలో దిట్టలని ఆయ‌న చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఓటమి అంచున ఉంద‌నే ఈ తప్పుడు ప్రకటనలతో మోసం చేయాలని చూసి మరింత దిగజారిందన్నారు.

1.32 లక్షలు ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌ని నిరూపిస్తే కేటీఆర్ ప‌ద‌వికి రాజీనామా చేస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా 7900 మంది ఫీల్డ్ మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్లను .. సాక్షర భారత్ కో ఆర్డినేటర్లను ఉద్యోగాల నుంచి తీసివేసిందని తీన్మార్ మ‌ల్ల‌న్న అన్నారు. కేసీఆర్ , కేటీఆర్ లను నిరుద్యోగులను చేస్తే తప్ప తెలంగాణ లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావన్నారు. ఇప్పటికే కేసీఆర్ మోసాలను గమనించిన ప్రజలు రాబోయే పట్టభద్రుల ఎన్నికలలో ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు పట్టం కట్టి టీఆర్ఎస్ పార్టీ అరాచకాల పీచం అణచబోతున్నార‌న్నారు.. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న లీగ్‌ల్ టీం ఉమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment