Thursday, February 18, 2021

పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని జంట హ‌త్య‌ల కేసులో పోలీసుల తీరుపై అనేక అనుమానాలు

హైదరాబాద్ : 18/02/2021

*నిర్ల‌క్ష్యం.. పోలీసుల తీరుపై అనుమానాలెన్నో..*

పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని జంట హ‌త్య‌ల కేసులో పోలీసుల తీరుపై అనేక అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. హ‌త్య చేసిన త‌ర్వాత కుంట శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి కమాన్‌పూర్ పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయార‌ని తెలుస్తోంది. అయితే ఆ స‌మాచారాన్ని కావాల‌నే పోలీసులు బ‌య‌ట‌పెట్ట‌లేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. సీన్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ను కాపాడటంలో పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్య‌వ‌హరించారే ఆరోపణ‌లు వినిపిస్తున్నాయి. సంఘ‌ట‌నా స్థలాన్ని వెంటనే సీజ్‌ చేయకుండా,ఆధారాలు చెదిరిపోకుండా చూడటంలో ఘోరంగా విఫ‌లం చెందారు. క‌నీసం క్లూస్‌ టీం వచ్చే వరకు ఆ స్థ‌లంలోకి ఎవ‌రూ రాకుండా, ఆధారాలు చెరిపేయకుండా చూడాలి. కానీ ఆ విషయాన్ని వారు అస‌లే పట్టించుకోలేదు. ఏదో నామ‌మాత్రంగా చిన్న‌ ముళ్లకంచెను తీసుకొచ్చి అడ్డంగా పెట్టారు. మృతుడు వామనరావు సెల్‌ ఫోన్‌, కడియం, కళ్లద్దాలు, ఇతర వస్తువులన్నీ అక్కడే చెల్లాచెదురుగా ఉన్నా ప‌ట్టించుకోలేదు. క‌నీసం ఉన్న‌తాధికారులు సంఘటనా స్థలాన్ని ప‌రిశీలించ‌లేదు. అంద‌రూ లాయ‌ర్ దంపతుల‌ను త‌ర‌లించిన‌ పెద్దపల్లి ఆస్పత్రికి వెళ్లి విచారించారు.

*Q న్యూస్*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment