హైదరాబాద్ : 03/02/2021
*కేటీఆర్‌కు సీఎం పదవిపై ప్రజాభిప్రాయం ఇదే!*
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించబోతున్నారని మీడియాలో వస్తున్న వార్తలు, దాన్ని బలపర్చేలా ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేస్తున్న వరుస వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల తారక రామారావు పట్ల సాధారణ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే అంశంపై *ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిజిటల్, టెలివిజన్ మీడియాలలో* విస్తృతస్థాయిలో ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఈ పోల్ ప్రక్రియ మొత్తం శాస్త్రీయపద్ధతిలో.. అత్యంత పారదర్శకంగా జరిగింది. కేటీఆర్ పట్టాభిషేకం ఊహాగానాలపై మీరేమనుకుంటున్నారు..? అని అడిగిన ప్రశ్నకు *54% మంది ప్రజలు ఇదే సరైన సమయమని బదులిచ్చారు. 45% మంది మాత్రం ఇప్పుడు సమయం కాదని తమ అభిప్రాయాల్ని చెప్పారు.* ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్ధుడా..? అని ఏబీఎన్ అడిగిన మరో ప్రశ్నకు సరైన వ్యక్తి అని *54% మంది ప్రజలు క్లారిటీగా చెప్పారు. 45% మంది ప్రజలు మాత్రం అంత అనుభవం లేదని తేల్చారు*. ఓవరాల్‌గా కేటీఆర్‌కు తెలంగాణ ప్రజానీకం మద్ధతు అయితే మెండుగా కనిపిస్తోంది.
*Q న్యూస్ సౌజన్యంతో*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment