Saturday, February 13, 2021

భేష్ తెలంగాణ పోలీస్..! టెక్నాలజీ సాయంతో భలే తేల్చేశారు కేసును..!!



హైదరాబాద్ : 13/02/2021

‘‘కాలు జారింది, నోరు జారింది, పట్టుబడిపోయింది’’ అని….. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి, నోరుజారి, బయటపడిపోయి, జైలుపాలైన ఓ మమత కేసు చదివాం కదా ఇంతకుముందు…. ఇది అంతకన్నా క్లాసిక్ కేసు… కాదు, ఇది పోలీసులు అండర్ ఎస్టిమేట్ చేసి, వాళ్లనే ఫూల్స్‌ను చేయాలని ప్రయత్నించి, అడ్డంగా దొరికిపోయిన కేసు… ఈ కేసులో మనం మెచ్చుకోవాల్సింది తెలంగాణ పోలీసుల్ని, వాళ్లు ఉయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని..! కేసు ఏమిటంటే..? ఓ ఫార్మసీ విద్యార్థిని విచ్చలవిడి జీవితానికి అలవాటు పడింది… ఓ ప్రియుడితో కలిసి వెళ్లింది, గంజాయి దట్టించింది, ప్రియుడితోనే కాదు, తన ఇద్దరు సోదరులతోనూ కలిసి ‘ఎంజాయ్’ చేసింది… ఒకసారి గీత దాటాక ఇక అడ్డేముంది..? సంఖ్యతో పనేముంది..?

illegal

అయ్యో, అయ్యో, నన్ను ఆటో డ్రైవర్ ఒకడు కిడ్నాప్ చేశాడు, రేప్ అటెంప్ట్ చేశాడు అని మొదట బుకాయించింది… వెంటనే మీడియా అందుకుంది… నగరంలో ఏమిటీ పరిస్థితి..? సజ్జనార్ మళ్లీ సీన్ రీక్రియేషన్ పేరిట తుపాకీ బయటికి తీయాల్సిందే, సదరు ఆటో డ్రైవర్లు కథను ఖతం చేయాల్సిందేనంటూ సోషల్ మీడియాలో కథనాలు… మెయిన్ స్రీమ్ మీడియా వార్తల్లోనూ బోలెడు స్టోరీలు, సూచనలు… కాల్చు, కాల్చెయ్ అంటూ ఉసిగొల్పే పిలుపులు… వాళ్లే తీర్పులు చెప్పేసి, వాళ్లే మరణశిక్ష అమలు గురించి చెప్పేస్తున్నారు… చివరికి ఆటో డ్రైవర్స్ photos వేసి మరీ వాళ్ళను బజారుకు లాగారు… దారుణం… ఇక్కడే తెలంగాణ పోలీసులు జాగ్రత్తగా సీన్ రీక్రియేషన్ స్టార్ట్ చేశారు… (నిజానికి మన మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టిలో సీన్ రీక్రియేషన్ అంటే…. ఎన్‌కౌంటర్ పేరిట ఖతం చేసే కార్యక్రమం కచ్చితంగా… ఉంటుందని భ్రమపడ్డారు)

పోలీసులు పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు… గూగుల్ మ్యాపింగ్ ద్వారా అసలు ఆ అనుమానిత ఆటోడ్రైవర్లు ఆ సమయంలో ఎక్కడున్నారు అని శోధించారు… ఆమె చెబుతున్న పరిసరాల్లో ఆ సమయాల్లో వాళ్లు లేరని తేలింది… నిజానికి చాలా కరెక్ట్ దర్యాప్తు పద్ధతి ఇది… అన్నింటికీ మించి సదరు యువతి కూడా కాలుజారింది, కానీ నోరు జారిన సంగతి చాలామందికి పట్టలేదు… ఆమె ఏం చేసింది..? ఫోన్ చేసి, తల్లికి తనను ఓ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని బొంకింది… అక్కడ పోలీసులకు వెలిగింది బల్బు… ఎవడైనా రేపిస్టు, పైగా గ్యాంగ్, ముందు ఆమె ఫోన్ తీసుకుంటారు కదా… ఆమెకు ఫోన్ చేసేంత చాన్స్ ఎలా దొరికింది..? ఆ డౌట్‌తోనే అసలు కథను తవ్వడం స్టార్ట్ చేశారు… సీసీటీవీ పుటేజీలో ఏదో ద్విచక్రవాహనం మీద వెళ్లినట్టు తెలిసింది… మరి మధ్యలో ఆటో ఎలా వచ్చింది… అక్కడ దొరికిింది అసలు ట్విస్టు…

కాస్త పోలీసు మర్యాద రుచిచూసేసరికి అసలు కథ బయటపెట్టేసింది పిల్ల…. విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి, గంజాయి సేవించి, ఒకడు ప్లస్ వాళ్ల సోదరులతోనూ ‘‘గడిపి’’… తల్లి పదే పదే ఫోన్లు చేసేసరికి… నోటికొచ్చిన అబద్ధం చెప్పేసింది… తల్లి ఆందోళనపడి, పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ ఇలా బయటపడింది… హైదరాబాద్ నగర జీవితంలో కొందరు అమ్మాయిల విశృంఖల జీవనాన్ని ఈ కేసు పట్టించింది… అమ్మాయి కదా అనే జాలి, సానుభూతితో కాదు… అసలు చాలామంది ఎందుకిలా మారుతున్నారు..? అదీ అసలు ప్రశ్న… దానికి కారణాల అన్వేషణ అవసరం… ఈ కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తు పద్ధతి, వాళ్లు ఉపయోగించిన టెక్నాలజీ, పాటించిన సంయమనం అభినందనీయం…!!

*link Media (ముచ్చట) సౌజన్యంతో*

https://prajasankalpam1.blogspot.com/


No comments:

Post a Comment