Thursday, December 26, 2024

*KGBV పాఠశాలలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను పంపడం సరికాదు.*

*KGBV పాఠశాలలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను పంపడం సరికాదు.*
 
*TUTF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామినేని వెంలాటేశ్వర్లు(RV), లచ్చుమల్ల వెంకన్న.*

*కేజీబీవీ పాఠశాలలకు ప్రభుత్వ ఉపాధ్యా యులను డిప్యూటేషన్ పై పంపడాన్ని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కార్యదర్శులు రామినేని వెంకటేశ్వర్లు, లచ్చుమల్ల వెంకన్నలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు గత 15 రోజులుగా దీక్ష చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను చర్చలకు పిలిచి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇటీవలనే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వివిధ రూపాలలో పని సర్దుబాటు రూపంలో మిగులుగా గుర్తించబడిన పాఠశాల నుండి అవసరమైన పాఠశాలకు పంపించడం జరిగింది రానున్న వార్షిక పరీక్షల దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇతర చోట్లకు పంపిస్తే తీవ్ర నష్టం జరుగుతుంది. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్షను విరమింప చేయటానికి ప్రభుత్వం కృషి చేయాలి. దీక్ష కొనసాగుతున్నందున ఆయా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి తప్ప ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను పంపడం సరికాదు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులతో చర్చలు జరిపి సాధ్యాసాధ్యాలని వారికి వివరించి తక్షణం సమ్మె విరమింప చేయాలని ప్రభుత్వానికి తెలియజేశారు.*

No comments:

Post a Comment