Tuesday, December 3, 2024

భవనాలు,లే అవుట్ల అనుమతులకు 'బిల్డ్ నౌ''

భవనాలు, లే అవుట్ల అనుమతులకు 'బిల్డ్ నౌ' పేరుతో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. అగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ దన్నుగా భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను  సులభంగా, వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ఈ కొత్త విధానం దోహదం చేస్తుందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు తెలిపారు.  ఫిబ్రవరి, 2025 నుంచి ఈ కొత్త విధానాన్ని   ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారి చేతులమీదుగా ప్రారంభించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కృషి చేస్తుందన్నారు.

Courtesy / Source by : 
https://x.com/PrlsecyMAUD/status/1863913769707217164?t=9Jie90sUdwF72gkYgpwq2w&s=19

No comments:

Post a Comment