*_నగరంలో నయీం వారసుడు.!_*
_# నాగోల్ క్రిమినల్ కేసు_
_# అంతర్ రాష్ట్రంలో హల్చల్_
_# రాజకీయ నాయకుల నీడలో..!_
_# సహించం: పోలీసు ఉన్నతాధికారులు_
Courtesy / Source by :
_('తెలంగాణ వాచ్' సంచలన కథనం)_
*_అతగారిని చూస్తే భగవంతుడు సైతం ఆశ్చర్య పోతాడు. పైకి పరమ పవిత్రమైన భక్తుని రూపంలో... బొట్లు పెట్టి మరీ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నట్టు కనిపిస్తాడు. ఆయనగారి చరిత్రలోకి వెళితే అంకుశం రామిరెడ్డి ఎందకూ పనికిరాడు. తెలంగాణ రాష్ట్రాన్ని కుదుపేసిన రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడి. బెదిరింపులు, కేసులు షరామామూలే.! ఇతగారు ఒకసారి న్యాయస్థానం నుంచి పరారయిన కేసులో కూడా ఉన్నాడు. ఆయనే దిగ్రేట్ భాషపాక సోమయ్య @ సోమన్న. అన్నీ కలిసొస్తే మరో నయీం అయ్యే అవకాశాలు ఉన్నట్లు బాధితులు చెపుతున్నారు._*
కాలచక్రం గిర్రున తిరిగి మళ్ళీ మొదటి ప్రస్థానం నుంచి సాగిపోతుంది. అలాగే నయీం పీడీ విరగడ అయిందని భావిస్తున్న తరుణంలో అలాంటి సంఘటనలే మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. నయీం దగ్గర పనిచేసిన చోటా మోటా నాయకులు నయీం తరహాలో బెదిరింపులకు దిగటంపై ఇటీవల పోలీసు శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. అందులో నాగోల్ లో ఒక క్రిమినల్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
*_గతంలో ఏం జరిగింది.?_*
నయీం తన భూ దందాలకు పోలీసులను పావులుగా వాడుకోవడం, కోట్లకు పడగలెత్తండం.. తప్పనిసరి పరిస్థితుల్లో 'కటాఫ్ మర్డర్' రూపంలో నయీం హతమవడం తెలిసిందే.! నయీం ఎన్ కౌంటర్ తర్వాత అతగాడితో అంటకాగిన పోలీసులు ఎందరో అనేక అగచాట్లు పడ్డారు. ఇప్పుడు ఇదే తరహాలో భాషపాక సోమయ్య @ సోమన్న భూ దందాలతో చెలరేగిపోతున్నాడని, బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.
*_నాగోల్ క్రిమినల్ కేసులో...:_*
ఎఫ్ఐఆర్ నెంబర్: 679/2024లో 'గ్యాంగ్ స్టార్ నయీం ప్రధాన అనుచరుడు, కాంట్రాక్ట్ మర్డర్ లు చేస్తూ పలు హత్యల్లో ముద్దాయిగా వున్న భాషపాక సోమయ్య @ సోమన్న అనే వ్యక్తి నన్ను చంపుతానని వార్నింగ్ ఇచ్చి, నామీద దాడిచేయుటకు తన గ్యాంగ్ తో వెంటాడుతూ నన్ను భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం గురించి....' అంటూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
*_అంతర్ రాష్ట్రంలో హల్చల్:_*
భాషపాక సోమయ్య @ సోమన్న "గ్యాంగ్ స్టార్ నయీం" ప్రధాన అనుచరుడు, కాంట్రాక్ట్ మర్డర్ లు చేస్తూ పలు హత్యల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఇతను నయీం గ్యాంగ్ తో కలిసి కోనాపూరి ఐలయ్య అలియాస్ సాంబశివుడు, కోనాపూరి రాములు హత్య కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కోనాపూరి రాములు హత్యలో వాడిన ఆయుధంతో కేరళ రాష్ట్రం, త్రివేండ్రంలోని ఒక లాడ్జిలో అరెస్ట్ అయ్యాడు. (కేసు నెంబర్: సిసి/1101375/2014) ఈ కేసులు నేటికి వివిధ న్యాయస్థానాలలో విచారణ కొనసాగుతున్నాయి. ఎసి/92/2021 కేసు కూడా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు సందర్భంగా న్యాయస్థానం నుంచి పారిపోయినట్లు మరో కేసు భువనగిరిలో నమోదు అయినట్లు తెలుస్తోంది.
*_రాజకీయ నాయకుల నీడలో...:_*
ఇలాంటి దందాలు చేసే చెంచాలు మంత్రులతో, స్థానిక నాయకులతో ఫోటోలు దిగటం, వాటితో హల్చల్ చేయటం గమనార్హం. ఈ కోవలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జర జాగ్రత్త సుమీ.!
*_సహించం: పోలీసు ఉన్నతాధికారులు_*
ఇలాంటి సంఘటనలను సహించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. డిజిపితో సహా గతంలో నయీం కేసులను పర్యవేక్షించిన సీనియర్ ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి దృష్టికి ఈ సోమయ్య విషయం వెల్లడం జరిగింది. ఆన్ లైన్ లో అందిన ఫిర్యాదులో సోమయ్యకు పోలీసు శాఖలో సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ అండగా ఉండగా... ఆ కానిస్టేబుల్ ద్వారా భువనగిరిలో గతంలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ఒకరిద్దరి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు సోమయ్య విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.!
No comments:
Post a Comment