పత్రిక ప్రకటన
తేదీ:-16-05-2024
- జిల్లా లో గుర్తింపు లేని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
- ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలలో బుక్స్, యూనిఫామ్స్, టైం, బెల్టు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- గుర్తింపు లేకుండా ఓపెన్ పర్మిషన్తో సిబిఎస్సి పేరు చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ.... మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు గుర్తింపు లేకుండా నడుపుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. గుర్తింపు లేకుండా ఓపెన్ పర్మిషన్తో సీబీఎస్సీ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్య అధికారులకు కోరుతున్నాము. విద్యాహక్కు చట్టం ప్రకారం ఫీజులు వసులు చేయవలసింది పోయి ప్రవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలే తనకంటూ ఒక చట్టం ఉన్నట్టుగా ఏర్పాటు చేసుకొని వాళ్లకు నచ్చిన విధంగా ఫీజు వసూలు చేస్తూ విద్యార్థినీ,విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర్నుండి దోపిడీ చేస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. మేడ్చల్ జిల్లాలో ఎల్కేజీ విద్యార్థికి రెండు లక్షల నుండి నాలుగు లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్టు అనేక పత్రికలలో వచ్చింది. కానీ విద్యాధికారులు ఏ విద్యాసంస్థల్లో ఎన్ని ఫీజులు ఉండాలని బహిర్గతంగా ప్రకటించకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా విద్యాధికారులే ప్రైవేట్ కార్పొరేటు విద్యాసంస్థల యజమానులకు నోటీస్ బోర్డ్ లో వాళ్ల ఫీజులని పెట్టించే విధంగా ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుందని కోరుతున్నాము. కూరగాయల బేరం ఆడినట్టుగా ప్రైవేట్ కార్పొరేటు పాఠశాల యజమాన్యం ఫీజుల బ్యారాల ఆడుతున్నారు. అకాడమీకేర్ ప్రారంభం కాకముందే అడ్మిషన్ తీసుకుంటే ఒక విధంగా ఫీజు ఉంటుంది. ప్రారంభం అయిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటే మరోలాగా ఫీజు వసూలు చేసే దుస్థితి విద్యాసంస్థల్లో రావడం సిగ్గుచేటు అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను అరికట్టే విధంగా విద్యాధికారులు చర్యలు ఉంటే బాగుంటుందని హెచ్చరించారు. ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలలో బుక్స్, యూనిఫామ్స్, టైం, బెల్ట్, అమ్ముతున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని పాఠశాలలో బుక్స్ యూనిఫామ్స్ టైం బెల్టు అమ్మడం నేరమైనప్పటి కూడా పాఠశాల యజమానులు అమ్ముతూ దోపిడీ చేస్తున్న చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న విద్యాధికారులు,బుక్స్ యూనిఫామ్స్ టైం బెల్టు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పేద,బడుగు బలహీన విద్యార్థిని విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా పోరాటం రూప పొందిస్తామని హెచ్చరించారు.
ధన్యవాదములతో.....
రాథోడ్ సంతోష్
ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
9618604620
No comments:
Post a Comment