_'రెవెన్యూ భూ బకాసురుడు' కేసులో..._
*_అసలు దుర్గ ఎక్కడ..?_*
_💥 ఖమ్మం పోలీసులకు ఛాలెంజ్_
_💥 ఓ మహిళను పట్టుకోలేని దుస్థితిలో డిపార్ట్ మెంట్ ఉందా..?_
_💥 పోలీస్ కమీషనర్ సునీల్ దత్ సీరియస్_
_💥 రంగంలోకి రెండు పోలీసు బృందాలు_
*నోట్: గ్రాడ్యుయేట్ పోలింగ్ కారణంగా రేపు ఈ కథనాలకు సెలవు. మంగళవారం మరో ఊహించని ఆసక్తికరమైన కథనం*
Courtesy / Source by :
_(ఖమ్మం, ప్రజాప్రశ్న)_
*_'అసలు దుర్గ ఎక్కడ..?' అంటూ ఓ కేసు విషయంలో అంతులేని కథలో ఓ మిస్టరీ ఉంది. దాన్ని చేధించే పనిలో ఖమ్మం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు విషయం ఖమ్మం పోలీసులకు ఛాలెంజ్ గా మారింది. ఇదిలా ఉండగా ఓ మహిళను పట్టుకోలేని దుస్థితిలో 'డిపార్ట్ మెంట్' ఉందా..? అనే ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. దీంతో ఖమ్మం జిల్లా పోలీస్ కమీషనర్ సునీల్ దత్ సీరియస్ గా ఉన్నారు. ఆయన ఆదేశాలతో రంగంలోకి రెండు పోలీసు బృందాలు ప్రత్యేకంగా దిగినట్లు తెలుస్తోంది. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారంలో ప్రత్యక్షంగా ఓ రెవెన్యూ, పరోక్షంగా ఓ న్యాయశాఖ ఉద్యోగి ఉండటం కలకలం రేపుతోంది._*
*https://epaper.prajaprashna.com/clip/36454*
*_అసలేం జరిగింది.?_*
ఖమ్మం అర్భన్, వెలుగుమట్ల రెవెన్యూ పంచాయితీ, పుట్టకోట గ్రామంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం మాదిరాజు రాం కిషన్ రావుకు సర్వే నెంబర్ 9/1లో రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై 2005లో రెవెన్యూ శాఖలో పనిచేసే భూక్యా శ్రీరాం కన్ను పడింది. పావులు చాలా తెలివిగా, వేగంగా కదిపాడు. అనుభవదారుగా ఉన్న మంగయ్య, పట్టాదారు వారసులుగా ఉన్న రామకూరి దుర్గ, శివరాజు రామజ్యోతిలతో కలిపి డాక్యుమెంట్ (నెంబర్ 2906/2008) తనకు అనుకూలంగా ఉన్న సరిహద్దులతో రెండు ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ ఉద్యోగి భూక్యా శ్రీరాం, కొత్తగూడెం గ్రామానికి చెందిన రావులపాటి శ్రీనివాస్ రావు, వడ్లమూడి సైదులు పేర్లతో
రిజిస్ట్రేషన్ జరిగింది. ఇక్కడి వరకు గుట్టుగా బాగానే ఉంది.
*_11 ఏళ్ళ తర్వాత బయటకు పొక్కి...:_*
11 ఏళ్ళ తర్వాత అనగా 2019లో భూక్యా శ్రీరాం రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ లో ఉన్న రామకూరి దుర్గను నేను కాదు, ఆ సంతకం నాది కాదంటూ అసలు వారసురాలు మార్చి 26, 2019న తన న్యాయవాది జి.సంజీవరెడ్డి ద్వారా నోటీసులు పంపటం జరిగింది. అంతే కాకుండా 2022లో పోలీసు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసింది.
*_తాజాగా...:_*
ఇలాంటి నీచమైన పనులపై క్రిమినల్ కేసులు కాకుండా భూక్యా శ్రీరాం అండ్ గ్యాంగ్ బాగానే 'మేనేజ్' చేసినట్లు బాధితులు ఆరోపిస్తూ ఖమ్మం పోలీసు కమీషనర్ కు తాజాగా మరో ఫిర్యాదు అందింది. ఇది ఇలా ఉండగా తన ఫోర్జరీ డాక్యుమెంట్ తో భూక్యా శ్రీరాం వేరే సర్వే నెంబర్ భూమిని కబ్జా చేయడానికి వెళ్ళి, అక్కడ అల్లరి మూకలతో హల్చల్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందటంతో ఓ క్రిమినల్ కేసు నమోదయింది. మరి ఖమ్మం జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ లు భూక్యా శ్రీరాంపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.
*_ఓనర్లకు భలే టోకరా.!_*
భూక్యా శ్రీరాం తెలివితేటలు వేరు. బహిరంగ మార్కెట్ లో సుమారు రూ. 4 కోట్ల విలువ చేసే ఈ భూమికి తూ..తూ మంత్రంగా డబ్బులు ఇచ్చి మోసం చేసిన వైనం ఈ సందర్బంగా వెలుగులోకి వచ్చింది. పట్టేదారులకు రూ.4 లక్షలు ఇచ్చినట్లు చెపుతుండగా అనుభవదారు మంగయ్యకు ఒక ఎకరం మాత్రమే రిజిస్టర్ చేసుకుంటున్నట్లు చెప్పి రూ.10 లక్షలు చెల్లించి రెండు ఎకరాలను రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా అనుభవదారు చనిపోయేంత వరకు 'నయా మూఠా' ఆ ఊరి చుట్టుపక్కలకు కూడా రాలేదని అక్కడి రైతులు చెప్పటం కొసమెరుపు.
_బాక్స్:_
*_భూక్యా కేసులు మాత్రమే కనపడవు.!_*
మనుషులను మార్చి రిజిస్ట్రేషన్ లకు తెగబడిన భూక్యా శ్రీరాం చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు. ఎంత జాగ్రత్తగా అంటే ఈయన వేసిన కేసులు కానీ, ఈయన పైన వేసిన కేసుల వివరాలు న్యాయస్థానం అంతర్జాలంలో కనిపించకుండా చేశాడని హైకోర్టు రిజిస్టార్ కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదులో ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా వారసురాలి భర్త తెర వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ భూ కేసుకు ఎలాంటి సంబంధం లేకున్నా ఇతరులపై కేసు వేసి కోర్టు డిక్రీలు తప్పుడు పద్దతిలో పొందినట్లు పోలీసులకు ఓ ఫిర్యాదు ఇటీవలే అందింది.
No comments:
Post a Comment