Saturday, May 11, 2024

కలవరపెడుతున్న బాలికల అదృశ్యం

కలవరపెడుతున్న బాలికల అదృశ్యం....

2019- 2021 దేశవ్యాప్తంగా 13.13 లక్షల మహిళలు, బాలికలు మిస్సింగ్.
18 సంవత్సరాల లోపు 2,51,430 మంది బాలికలు అదృశ్యమయ్యారని హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా జూలై 26న రాజ్యసభకు తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  ప్రకారం 2022 లో 90113 మంది బాలికలు 18 సంవత్సరాల లోపు వారు అదృశ్యం అయ్యారు అని, ఎక్కువగా 10 నుండి 14 సంవత్సరాల వయస్సు అమ్మాయిలు మిస్సింగ్. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ మిస్సింగ్ కేసులు.
మన తెలంగాణా 8 వ స్థానంలో ఉంది బాలికల మిస్సింగ్ విషయంలో. NCRB ప్రకారం 3443 మంది చిన్నారులు 2022 లో మిస్సింగ్ అయితే 391 మంది బాలికల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
ప్రతి రోజూ పది మంది పిల్లలు తిప్పి పోతున్నారు. 
మొదటి 24 గంటలు చాలా కీలకమైనవి.
పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా అలెర్ట్ గా ఉండాలి ఎక్కడైనా రద్ది ప్రాంతానికి వెళితే, వారి ముందే చెప్పాలి పొరపాటున క్రౌడ్ లో మిస్ అయితే వెంటనే చూసుకోవాలి,ఫోన్ చేయాలి అని. పేరెంట్స్ వెంటనే అలెర్ట్ అయి పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి. బంధువుల ఇంట్లో,స్నేహితుల ఇళ్లకు వెళ్లి లేదా ఫోన్ చేసి తెలుసు కోవడం చేయాలి. 100/1098 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి, పిల్లల ఫోటో,వేసుకున్న డ్రెస్ వివరాలు ఇవ్వండి, సోషల్ మీడియాలో  షేర్ చేస్తే కూడా ఉపయోగపడుతుంది ఆచూకీ కోసం. ఆలస్యం చేయకుండా అలర్ట్ కావాలి. ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం. అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెందడం వల్ల ఇంటి నుంచి వెళ్లిపోతారు,టీనేజ్ అమ్మాయిలు ఎవరైనా ఇబ్బందికి గురి చేస్తే తట్టుకోలేక, పరీక్షలు ఫెయిల్ అయిన,సరిగా రాయక పోయిన, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తిట్టిన  ఇంటి నుంచి వెళ్లిపోతారు. ఇక కిడ్నాప్ కు గురి అయిన పిల్లలు మిస్ అవుతారు. ఎవరైనా అనుమాన స్పదంగా తిరిగుతూ కనిపిస్తే అలర్ట్ కావాలి. కిడ్నాప్ కు ప్రయత్నిస్తే పిల్లలు అరవాలి ,కేకలు వేయాలి. ముఖ్యంగా అమ్మాయిలను మానసికంగా, శారీరకంగా చాలా ధైర్యంగా ఉండేలా చూసుకోవాలి పేరెంట్స్, గార్డియన్స్. ప్రభుత్వం త్వరితగతిన పిల్లలను ట్రేస్ చేయడానికి సరియైన టెక్నాలజీ డెవలప్ చేసి,వీలైనంత వరకు పిల్లలను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించాలి అని బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి.

అనూరాధ రావు 
అధ్యక్షురాలు 
బాలల హక్కుల సంఘం

No comments:

Post a Comment