Friday, May 31, 2024

"చేప ప్రసాదం"..అదోక మూఢనమ్మకం(బాలలహక్కులసంఘం)

ప్రచురణార్ధం:

హైదరాబాద్లో ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఆస్తమాతో బాధ పడుతున్న వారికి "చేప ప్రసాదం" ఇస్తారు,అదోక మూఢనమ్మకం.గతం లో "చేప మందు" అని అనే వారు, ఔషధాలు లేవు అని బాలల హక్కుల సంఘం ద్వారా నిర్ధారణ అయ్యాక "చేప ప్రసాదం"గా పిలుస్తున్నారు.
ప్రసాదం తో ఆరోగ్యము బాగు అయినట్టు ఇప్పటివరకు ఎక్కడ నిర్ధారణ కాలేదు. 2015-16 సంవత్సరంలో ఆ "చేప ప్రసాదం" లో ఎలాంటి ఔషధాలు లేవు అని ఉన్నవి కేవలం గోధుమ పిండి, పసుపు, కాస్త నూనె మాత్రమే అని ప్రభుత్వ ఆహార ప్రయోగశాల నిర్ధారించింది. తల్లిదండ్రులకు బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి: దయచేసి పిల్లలకు ఈ" చేప ప్రసాదం" వేయించ వద్దు. దానివల్ల రకరకాల ప్రమాదాలు ఉన్నాయి. చేపను మింగడం, ఒక్కొసారి గొంతు లో ఇరికి ఊపిరి ఆగిపొతుంది, ఒకరి నోట్లో పెట్టిన చేయి తో ఇంకోకరి నోట్లో పెట్టడం ద్వారా కొన్ని రకాల అంటు వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఔషధంగా గుర్తించని ఏ పదార్థాన్ని పిల్లలకు ఇవ్వకూడదు,అది నేరం. 
పిల్లలకు ఈ "చేప ప్రసాదం" ఇవ్వకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్.

అనురాధ రావు
ప్రెసిడెంట్ 
బాలల హక్కుల సంఘం

No comments:

Post a Comment