Monday, July 11, 2022

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్....అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా

*కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్....అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా*

తెలంగాణలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. రాజకీయ నేతలు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.రేవంత్‌ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు దమ్ముంటే నాలుగు రోజుల్లో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి. కాంగ్రెస్‌కు 90 లక్షల ఓట్లకు తక్కువ పడ్డా నా పేరు మార్చుకుంటాను. కేసీఆర్‌ను వదిలించుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారు.

కేసీఆర్‌కు మానవ సంబంధాలు లేవు. కేవలం ఆర్థిక లావాదేవీలే ఉంటాయి. రాజపక్సే కుటుంబానికి వచ్చిన పరిస్థితే.. కేసీఆర్ కుటుంబానికి వస్తుంది. సహారా కుంభకోణంలో కేసీఆర్‌ను కాపాడుతున్నదే బీజేపీ. కేసీఆర్ అవినీతిపై ప్రధాని మోదీ విచారణకు ఆదేశిస్తారని మేము ఆశించాము. కానీ, అలా జరగలేదు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో ఒక్క పైసా కూడా వద్దని మోడీతో కేసీఆర్ చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ వ్యూహాకర్త కేసీఆర్‌కు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్టులో టీఆర్‌ఎస్‌ 25 సీట్లు మాత్రమే గెలుస్తుందని ఉంది. మరో 17 సీట్లలో పోటాపోటీ ఉందని నివేదిక ఇచ్చింది. టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగింది. అందుకు నా పేరు పలికేందుకు కేసీఆర్‌ భయపడుతున్నాడు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment