Monday, July 18, 2022

మహిళల కోసం ప్రత్యేక..... లీగల్ సెల్

*మహిళల కోసం  ప్రత్యేక..... లీగల్ సెల్*

హైదరాబాద్‌: మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ప్రత్యేకంగా లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేసింది.
రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్‌ సెల్‌ను సోమవారం జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు.

మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని రేఖా శర్మ అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ కమిషన్‌ కార్యక్రమాలను, సేవలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు చట్టపరమైన సహాయం కోసం ఈ సెల్‌ వన్‌-స్టాప్‌ సెంటర్‌గా పనిచేస్తుందని సునీతాలక్ష్మారెడ్డి వివరించారు. అలాగే మహిళలకు సహాయంగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ 9490555533, ఫేస్‌ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులు గురించి తెలియజేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment