Saturday, July 16, 2022

బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..

బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..

బాసర ట్రిపుల్ ఐటీలో శుక్రవారం  కలుషిత ఆహారం కారణంగా ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. దీంతో వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నేడు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట ఆందోళనకు దిగారు.

Basara iiit Students protest over food poison

Courtesy by : telugu.asianetnews.com(Twitter)
First Published Jul 16, 2022, 2:45 PM IST

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. బాసర ట్రిపుల్ ఐటీలో శుక్రవారం  కలుషిత ఆహారం కారణంగా ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. దీంతో వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నేడు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు అస్వస్థతకు గురైన విద్యార్థులు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

ఇక, శుక్రవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పీయూసీ-1, పీయూసీ-2 హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం తర్వాత వాంతులు, విరేచనాలు అయ్యాయి. మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ వడ్డించారని.. అది తిన్న చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. కొందరు స్పృహ తప్పిపడిపోయారు. దీంతో అప్రమత్తమైన ట్రిపుల్ ఐటీ అధికారులు క్యాంపస్‌లోని ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌లో అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించారు. స్పృహతప్పి పడిపోయిన వారిని నిజామాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించారు.


ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకారం.. ఇన్స్టిట్యూట్‌లోని మూడు మెస్‌లలో రెండింటిలో భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒక మెస్‌లో 3,000 మంది విద్యార్థులకు, మరో మెస్‌లో 2,500 మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. ఈ రెండింటినీ ఒకే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. రెండు హాస్టళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ వడ్డించారు. మరో పక్క ఫుడ్‌ పాయిజన్‌ గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని వారి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. 

విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్‌గా స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ వి వెంకటరమణ ఆసుపత్రిని సందర్శించి, చేరిన విద్యార్థులకు అందుతున్న వైద్య సహాయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

No comments:

Post a Comment