*తడసి ముద్దవుతున్న హైదరాబాద్....నిండు కుండల్లా జంట జలాశయాలు*
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. భాగ్యనగరాన్ని ముసురు వదలడం లేదు. వరుసగా ఐదోరోజూ తేలికపాటి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.దీంతో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు పోటెత్తడంతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నిండుకుండలా మారాయి.
ఉస్మాన్‌సాగర్‌కు 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. రెండు గేట్లు ఎత్తి 312 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడిచిపెడుతున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1786 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. రెండు గేట్ల ద్వారా 515 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడిచిపెడుతున్నారు. హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుతం 1763.50 అడుగుల నీటిమట్టం ఉంది.
మరోవైపు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సారగ్ కూడా నిండుకుండలా మారింది. కూకట్‌పల్లి నాలా నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం 513.41 మీటర్ల పూర్తిస్థాయి చేరింది. వస్తున్న ఇన్‌ఫ్లోకు సమానంగా తూముల ద్వారా నీరు బయటకు వెళ్తోంది.
*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం
No comments:
Post a Comment