నేడు అత్యంత భారీ.... రానున్న రెండు రోజులు అతి భారీ... వర్షాలు : వాతావరణశాఖ*
హైదరాబాద్: దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనంగా బలపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఈ తీవ్ర అల్పపీడనం ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అత్యంత భారీ, రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.
*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం
No comments:
Post a Comment