*అంబర్ పేట టిఆర్ఎస్ లో ఫ్లెక్సీల పంచాయతీ...!*
*కృష్ణగౌడ్ అరెస్ట్, మంత్రి ఫోన్‌తో విడుదల*
హైదరాబాద్/రాంనగర్ /అంబర్‌పేట: ఫ్లెక్సీల గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. అంబర్‌పేట టీఆర్‌ఎ్‌సలో హైడ్రామా కొనసాగుతోంది.ఆదివారం అంబర్‌పేటలో మహంకాళి అమ్మవారి బోనాలు జరుగనున్నాయి. రెండు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన విషయం తెలిసిందే. అయితే శనివారం మధ్యాహ్నం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరుడు తొలుపునూరి కృష్ణగౌడ్ తిరిగి అదే స్థానంలో మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా అంబర్‌పేట సీఐ సుధాకర్ తన సిబ్బందితో వచ్చి అడ్డుకున్నాడు. స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే గొడవలు జరిగే అవకాశముందని, కృష్ణగౌడ్‌ను అరెస్ట్ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.
విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివా్‌సరెడ్డికి ఫోన్ చేసి కృష్ణగౌడ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఫొటో లేకుండా ప్లెక్సీలు పెడితే గొడవ జరిగే అవకాశం ఉందని, ముందుస్తుగానే అరెస్ట్ చేశామని వారు మంత్రికి తెలిపారు. దీంతో కష్ణగౌడ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని డీసీపీ శ్రీనివా్‌సరెడ్డి, ఏసీపీ వెంకటరమణ, అంబర్‌పేట సీఐ సుధాకర్ తెలిపారు. కృష్ణగౌడ్‌ను అరెస్ట్ చేశారని తెలుసుకున్న అంబర్‌పేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కె.పద్మావతిరెడ్డి, పులిజగన్, సీనియర్ నేతలు గరిగంటి రమేష్, ఎక్కాల కన్నా, కె.మురళీకృష్ణ అంబర్‌పేట పీఎ్‌సకు వచ్చి అతనికి సంఘీభావం తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ముందుగా కేసులు నమోదు చేయాలని వారు కోరారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు పిర్యాదుచేస్తామని వారు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు
ప్లెక్సీల వివాదంలో టీఆర్‌ఎస్ నాయకుడు కృష్ణగౌడ్ ఏర్పాటు చేసిన ప్లెక్సీని చించివేశారనే ఫిర్యాదుపై స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అనుచరులు మధుసూదన్‌రెడ్డి, అనిల్, దిలీప్, చందు, మిర్యాల రవీందర్‌లపై కేసు నమోదు చేశారు.
*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం
No comments:
Post a Comment