*దూకుడు పెంచిన BJP....పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జ్ ల నియామకం*
హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఆ పార్టీ దూకుడు పెంచింది. పార్టీ బలోపేతం వైపు అడుగులు వేస్తోంది. తెలంగాణ బీజేపీ చీప్ బండి సంజయ్ ఇప్పటికే చేరికలపైకేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజీపీ ముందుకు సాగుతోంది.
నాలుగు క్లస్టర్స్‌గా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు
తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్స్‌గా విభజించారు. ఒక్కో క్లస్టర్‌లో మూడు, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయి. ప్రతి నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌గా ఒక కేంద్రమంత్రిని నియమించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, భువనగిరి ఇన్‌చార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ ఇన్‌చార్జ్‌గా మహేంద్రనాథ్ పాండే, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి బీఎల్ వర్మను నియమించారు. వీరితో పాటు ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక కేంద్రమంత్రిని నియమించారు. ఆదిలాబాద్, పెద్దపల్లికి పురుషోత్తం రూపాల, జహీరాబాద్‌కు నిర్మలా సీతారామన్, మెదక్‌కు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, చేవెళ్ల, మల్కాజ్ గిరికి ప్రహ్లాద్ జోషి, భువనగిరికి దేవీసింగ్ చౌహాన్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్‌కు మహేంద్రనాథ్ పాండే, నల్లగొండకు కైలాశ్ చౌదరి, వరంగల్‌కు ఇంద్రజిత్ సింగ్, హైదరాబాద్‌కు జ్యోతిరాధిత్య సింధియా, మహబూబాబాద్, ఖమ్మంకు బీఎల్ వర్మను నియమించారు.తెలంగాణ నుంచి పార్లమెంట్ ప్రవాసీ కన్వీనర్‌గా ప్రేమేందర్ రెడ్డి, కోకన్వీనర్లుగా ఉమారాణి, జయశ్రీని నియమించారు. అధ్యయనం చేశారు.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment