Saturday, June 17, 2023

తెలంగాణలో ఎం జరుగుతుంది ... మంత్రి KTR...!

*తెలంగాణలో ఎం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి.... మంత్రి KTR...!*

*వరంగల్...!*
ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వరంగల్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న టెక్స్‌టైల్‌ పార్కుకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.261 ఎకరాల్లో రూ.900 కోట్లతో టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. యంగ్‌ వన్‌ కంపెనీ టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేయనుంది. భూమిపూజ అనంతనం కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

''వరంగల్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం. పట్టుపట్టి మరీ వరంగల్‌లో కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. నైపుణ్యం ఉన్న నేతన్నలు ఉన్నారు కాబట్టే వరంగల్‌కు మంచి పేరు వచ్చింది. వరంగల్‌ జిల్లాలో నాణ్యమైన పత్తి పండుతోంది. గణేశా కంపెనీ ఇప్పటికే రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టింది. గణేశా కంపెనీలో వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చాయి. యంగ్‌ వన్‌ కంపెనీలో మొత్తంగా 11 పరిశ్రమలు వస్తాయి. తద్వారా వేల ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ నిర్మించే పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి.మేడిన్‌ వరంగల్‌ దుస్తులు అనేక దేశాలకు వెళ్తాయి. యంగ్‌ వన్‌ కంపెనీ కొరియాలో పెద్ద పరిశ్రమ. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి. మన దేశంలో వ్యవసాయ, టెక్స్‌టైల్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి. టెక్స్‌టైల్ రంగంలో మనకంటే బంగ్లాదేశ్‌, శ్రీలంక ముందున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మేల్కొని పీఎం మిత్ర పథకం తీసుకొచ్చింది. వరంగల్‌ జిల్లాలో రానున్న 3 కంపెనీల ద్వారా 33 వేల ఉద్యోగాలు వస్తాయి. చల్లా ధర్మారెడ్డి చొరవ వల్లే కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కు వచ్చింది. పరకాలలో ధర్మారెడ్డిపై పోటీ చేయాలంటే భయపడుతున్నారు. నియోజకవర్గాలు మార్చుకొని మరీ వేరేచోటుకు వెళ్లిపోతున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment