*ఒరిస్సా రైలు ప్రమాదం...రక్తదానానికి ఆసుపత్రికీ కదలిన.... యువత*
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 238కు చేరింది. 900 పైగా మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా మృతదేహాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి.ఎంతో మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నా బోగీల కింద చిక్కుకున్న చాలా మంది బాధితులు సాయం కోసం ఆర్జిస్తున్నారు. 7 ఎన్డీఆర్ఎఫ్, 5 ఓడీఆర్ఎఫ్, 24 ఫైర్ సర్వీస్ యూనిట్స్ ,లోకల్ పోలీసులు,వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరందరికీ రక్తం అవసరం ఉందని తెలిసి చాలా మంది రక్తదానం చేసేందుకు భద్రక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి క్యూ కట్టారు. క్యూలో నిలబడి రక్తం దానం చేస్తున్నారు. వీరంతా ఏ పిలుపూ లేకుండానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మానవత్వాని చాటుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి మరీ క్షతగాత్రులకు రక్తదానం చేస్తున్నారు. కాగా, ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులుతీవ్రంగా శ్రమిస్తున్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment