Wednesday, June 28, 2023

కాళేశ్వరం'పై ఆడిట్ రిప్లై


*_'కాళేశ్వరం'పై ఆడిట్ రిప్లై_*
_★ హైదరాబాద్ కేంద్రంగా కసరత్తులు_
_★ కాచి వడపోస్తున్న అధికారులు_
_★ 'కాగ్' అడిగిన అవినీతికి ధీటైన సమాధానాలు రెడీ_
_★ మరో రెండు రోజులు కొనసాగనున్న లెక్కలు_

Courtesy by : _(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 'ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం, 9440000009)_

*_కాళేశ్వరం ప్రోజెక్టుకు సంబంధించిన ఆడిట్ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం నుంచి సంబంధిత అధికారులు మొదలెట్టారు. గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) కాళేశ్వరం ప్రోజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాల గురించి అనేక ప్రశ్నలను తెలంగాణ రాష్ట్రానికి పంపింది. దీనికి ధీటుగా సమాధానం చెప్పటం కోసం సంబంధిత అధికారులు కసరత్తులు మొదలెట్టారు. గుట్టుగా జరుగుతున్న ఈ' ఆడిట్ రిప్లై'పై 'ఆదాబ్.హైదరాబాద్' అందిస్తున్న ప్రత్యేక కథనం._*

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02pzWC593sGNiZv18Kw8VrGxH19QX5s7v46h7n37xKnzaSkWgLxfNmgiwVHM6ofBCol&id=100063772548665&mibextid=Nif5oz

*_ప్రధాన ఆరోపణలు ఇవే:_*
కాగ్ అధికారుల దృష్టిలో అనేక అరోపణలు ఉన్నప్పటికీ.. నిధుల దుర్వినియోగంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగ్ పేర్కొన్న అంశాలలో ముఖ్యమైనవి.

*_లాభం ఎవరికి.?:_*
డిజైన్లు మార్చడానికి గల కారణాలు, అందుకు అయిన అదనపు వ్యయం, కాంట్రాక్టర్ పాత్ర గురించి, వారికి అదనంగా ఎంత వరకు లాభించింది

*_అంచనాలు అంతగా పెరగటానికి..:_*
ప్రాజెక్ట్ వ్యయం రూ. 40,000 కోట్ల నుండి లక్ష కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఎంత.?

*_దారిమళ్ళిన నిధులు..:_*
జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం రూ. గత నాలుగేళ్లలో 3982 కోట్లు ఇచ్చింది. పీఎంకేఎస్‌వై, ఏఐబీపీ, సీఏడబ్ల్యూఎం పథకాల కింద కేంద్రం రూ. 1195 కోట్లు ఇచ్చింది. పేర్కొన్న ఆయన ఇతర కేంద్ర నిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. 1,15,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎందుకు ప్రభుత్వం దారి మళ్లించింది.

*_ఎందుకీ అప్పగింత:_*
ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు అప్పగించటం గురించి.

*_105 మిషన్ల గురించి..:_*
కాళేశ్వరం ప్రాజెక్టులో 120 మిషన్లకు బదులు 105 మిషన్లు అమర్చి 20 పంప్ హౌస్ లకు బదులు 17 పంప్ హౌస్ లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కన్నెపల్లి పంప్ హౌస్ లోకి వరద నీరు వచ్చి 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయినట్లు అధికారులు గుర్తించారు.

*_అప్పు ఎంత..?:_*
ఈ ప్రోజెక్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కు తెలంగాణ  ప్రభుత్వం  చేసిన అప్పు అక్షరాలా 97, 447కోట్లుగా తేలింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో వివిధ బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భారీగా అప్పులు ఇచ్చాయి.

*_ఫోకస్ ఎందుకు.:_*
అధికారుల బృందం... నిర్మాణ వ్యయం, మోటార్లు, పంపులు, ఇతర హైడ్రో ఎలక్ట్రికల్‌‌ పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు. కేసీఆర్ సర్కార్ చేపట్టిన మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులపైనే ఎక్కువగా ఫోకస్

*_పరిహారంలో మతలబు:_*
భూ నిర్వాసితులకు పరిహారం, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ, ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, ఇంకా ఎంత భూమి సేకరించాల్సి ఉందనే వివరాలు కావాలని కోరిందట. మూడో ‌ టీఎంసీ అంచనా వ్యయం, పనుల పురోగతి, మూడో టీఎంసీతో కలిగే ప్రయోజనాలు కూడా కాగ్ బృందం అడిగిందట. 

*_ఫిర్యాదులతో ముందుకు..:_*
సిబిఐకి బక్క జడ్సన్, కాగ్ కు షర్మిల ఫిర్యాదులు చేశారు. షర్మిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోసం అడిగినట్లు తెలుస్తోంది.

బాక్స్:
*_ప్రభుత్వ వాదన ఇలా..:_*
గోదావరి వరద ఏకంగా 108.02 మీటర్ల మేర ప్రవహించింది. పరిమాణం 29 లక్షల క్యూసెకులకు పైగా ఉన్నది. అంటే 1986 మట్టం కన్నా 1.2 మీటర్లు అధికం. అసాధారణ ఆ వరద వల్లనే పంప్‌హౌజ్‌ రెగ్యులేటర్‌ గేట్ల రబ్బర్‌ సీల్స్‌ ఊడిపోయాయి. ఫోర్‌బేలోకి అధికమొత్తంలో నీళ్లు వచ్చాయి. అతి భారీ వర్షాలకు పంప్‌హౌజ్‌ 220 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్తు సరఫరా చేసే టవర్లు కూలిపోయాయి. దీంతో అధికారులు నీరు తోడలేక పోయారు. ఫలితంగా ఫోర్‌బే రక్షణ గోడపై వత్తిడి పెరిగి కొంత కూలిపోయింది. పంప్‌హౌజ్‌ నీళ్లతో నిండింది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోని 17 పంపుల్లో 3 మాత్రమే దెబ్బతిన్నాయి. చందనపూర్‌ వాగు పొంగడం వల్ల బరాజ్‌ రక్షణకు నిర్మించిన కరకట్టపై నుంచి నీరు పొర్లినందువల్ల అన్నారం పంప్‌హౌజ్‌ మునిగింది.

No comments:

Post a Comment