*Human Rights Forum,TS*
*మానవ హక్కుల వేదిక*
14.06.2023.
పత్రిక ప్రకటన
*రైతుల చేతులకు బేడీల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి*
ఇటీవల మంత్రి కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులు నలుగురిని యాదద్రి భువనగిరి జిల్లా పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటమే కాక, జైలు నుండి వాళ్లకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చిన సంఘటనను మా సoస్థ తీవ్రంగా ఖండిస్తున్నది.
గతంలో 2017 జూలై నెలలో ఖమ్మంలో మిర్చీ పంటకు మద్దతు ధర కోసం ధర్నా చేసిన ఎనిమిది మంది రైతులను, 2018 ఆగస్ట్ నెలలో తన భూమి సమస్య కోసం ఎం.ఆర్. ఓ ఆఫీసు ముందు నిరసన తెలిపిన రైతు ను కూడా చేతులకు బేడీలు వేసి బజారులో నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు.
మా సంస్థ ఈ విషయంలో పోలీసులను మాత్రమే ( per se) తప్పు పట్టడం లేదు. నిరసనలను అనచివేయడానికి ప్రభుత్వం పోలీసులకు ఇచ్చిన అభయ హస్తం ( impunity) వల్ల పోలీసు శాఖ ఇష్టా రాజ్యాంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. నిందితుడికి బేడీలు వేసి కోర్టు కు తీసుక పోయే విషయంలో గతంలో సుప్రీం కోర్టు, మూడేళ్ల క్రితం విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ ను బేడీలతో కోర్టుకు తీసుకెళ్లిన సందర్భంలో ఢిల్లీ హైోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, కొన్ని మార్గదర్శకాలను సూచించింది.
భారీ హత్యలూ, ఆర్థిక నేరాలు చేసే ఆర్థిక ఉన్నత వర్గాలకు సకల మర్యాదలు చేసే పోలీసులు, ప్రభుత్వాలు తమ భూములు పోతున్నాయని ఆకృషించే రైతుల చేతులకు బేడీలు వేసి తిప్పటం సిగ్గుచేటు.
భోన గిరిలో రైతుల కు బేడీలు వేసిన సంఘటనపై విచారణ జరపాలనీ, అత్యుత్సాహాన్ని ప్రదర్శించి రైతుల గౌరవ, ప్రతిష్టలను భంగపర్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలనీ, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆదేశాలు జారీ చేయాలనీ మా సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
- *ఎస్. జీవన్ కుమార్*
(ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ)
*డా. ఎస్.తిరుపతయ్య*
(తెలంగాణ ప్రధాన కార్యదర్శి)
*ఆత్రం భు జంగ రావు*
(తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు)
No comments:
Post a Comment