Friday, June 30, 2023

విద్యాహక్కు చట్టం విశిష్ఠత

*పత్రిక ప్రచురణార్ధం*
*తేది:30:06:2023*

*#📘🖊️ విద్యాహక్కు చట్టం విశిష్ఠత.. విద్యాశాఖ పై ప్రభుత్వ నిర్లక్ష్య విధానం... ఇదే అదునుగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు అధిక ఫీజుల పేరిట అడ్డగొలు దోపిడి#*

*రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన విద్యాశాఖను పూర్తిగా గాలికొదిలేసిన ప్రభుత్వం.*

*రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం...*

*నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ, విద్యార్ధులకు నలబై నుండి డెబ్బై వేల వరకు ఫీజుల పేరిట దోపిడి చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్*

*రాష్ట్రంలో ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థల అడ్డగోలు ఫీజుల దోపిడి.. కమీషన్లు తీసుకోని అందుకు సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులు*

*ప్రైవేట్ పాఠశాలలపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయని విద్యాశాఖ అధికారులు.*

*ప్రతి ఏటా అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలు.*

*మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని విద్యాశాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తున్నారు*

*ప్రతి మండలానికి ఒక విద్యాశాఖ అధికారి ఉండాలి..కానీ జిల్లాలో ఏడు మండలాలకు ఒక విద్యాశాఖ అధికారి నియమించారు*

*ఉన్న మండల విద్యాశాఖ అధికారులు ఆఫీస్ కి రారు.. ఫోన్ చేస్తే ఎత్తరు ,ఎవరికి కలవరు*

*ఒక్క స్కూల్ పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకోని అదే స్కూల్ పేరుమీద నాలుగు బ్రాంచీలు నడిపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతు,విద్యార్థుల జీవితాలతో చెలగాటంఆడుతున్నారు*

*విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలో ప్రతి వంద మంది విద్యార్థులలొ ఇరవై ఐదు మంది పేద విద్యార్థులకు {Economically Weaker Section,EWS} వారికి బుక్స్, యూనిఫాం,తో సహా ఫ్రీగా అడ్మిషన్స్ ఇవ్వాలి.*

*పక్కాగా స్కూల్ రికార్డ్ మెయింటెన్ చెయ్యాలి.*

🔹📘🖊️విద్యా హక్కు చట్టం 2009, ఆర్టికల్ 21A, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 38 నిబంధనలు,7 అధ్యాయాలలో ఈ చట్టం రూపొందించారు.
*ఈ చట్టం పేరు ఉచిత నిర్భంద విధ్య  బాలల హక్కుల చట్టం 2009*
ఈ చట్టం పరిధి: జమ్మూకాశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది.
6 నుండి 11 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి బాల, బాలికలకు ఉచిత & నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, ఆర్టికల్ 21A & 86వ సవరణ లో విద్యా హక్కు ఆర్టికల్ 21 A ప్రకారం రూపొందించారు.
విద్యా హక్కు ప్రజాస్వామ్యం యొక్క సాధారణ అభివృద్ధికి మరియు సమర్థవంతమైన కార్యాచరణకు ఇది చాలా అవసరం. విద్య ప్రజలను మరింత సమర్థులుగా మరియు ఇష్టపడేలా చేస్తుంది.ఇది రాజకీయ స్థిరత్వం, సామాజిక పురోగమనం మరియు ఆర్థిక శ్రేయస్సుకు ఆధారమైన సమాజ స్తంభంగా పరిగణించబడుతుంది. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క నాల్గవ ప్రాథమిక అవసరం, దుస్తులు, ఆశ్రయం మరియు ఆహారం.ఇది సమాజాన్ని నిలబెట్టే మూలస్తంభంగా పనిచేస్తుంది.విద్య ద్వారానే సామాజిక న్యాయం, సమానత్వం లభిస్తాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 A రాజ్యాంగం (ఎనభై ఆరవ సవరణ) చట్టం 2002 భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 21A జోడించబడింది , ప్రతి రాష్ట్రం ఆరు మరియు పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని ఈ చట్టంలో క్లియర్ గా పొందుపరిచారు. ఈ చట్టం విధి విధానాలు పరిశీలిస్తే ఆర్టికల్ 21 A, రాజ్యాంగ సవరణ ద్వారా 7 అధ్యాయాలు 38 సెక్షన్ లు పరిశీలిద్దాం..*#విద్యా హక్కు చట్టాన్ని సవివరంగా పరిశీలిద్దాం...*
🔹📘🖊️
*అధ్యాయం:1*
*సెక్షన్-1.* చట్టం పేరు: ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం.
2009చట్టం పరిధి: జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది.
చట్టం అమలు తేదీ: 2010, ఏప్రిల్ *సెక్షన్-2.* 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ పంచాయతీ.
*అధ్యాయం-2* 
*సెక్షన్-3.* 6 నుంచి 14 ఏండ్లలోపు బాలలందరికీ ఉచిత ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది.బాలలు ప్రాథమిక విద్య పూర్తిచేయడానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవరసరం లేదు.
*సెక్షన్-4*–6 నుంచి 14 ఏండ్లలోపు వయసున్న పిల్లలు మధ్యలోనే బడి మానివేస్తే వారిని తిరిగి వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి.
వయసుకు తగిన తరగతిలో చేరిన బాలలు తోటి విద్యార్థులతో సమానంగా ఆ తరగతి వరకు కావాల్సిన సామర్థ్యాలను పొందటానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.ఈ విధంగా ప్రాథమిక విద్యలో ప్రవేశించిన బాలలు 14 ఏండ్లు నిండినప్పటికీ ఎలిమెంటరీ విద్యను పూర్తిచేసేవరకు ఉచిత విద్యను పొందే హక్కు ఉంది.
– ఆ విద్యార్థులకు శిక్షణ కాలవ్యవధి కనీసం మూడు నెలలు, గరిష్టంగా రెండేండ్లవరకు ఉండవచ్చు.
*సెక్షన్-5*–బడిలో ప్రాథమిక విద్య పూర్తిచేసే సదుపాయం లేకపోతే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ ఇతర బడికైనా బదిలీ కోరే హక్కు బాలలకు ఉంటుంది.
*అధ్యాయం-3* సెక్షన్-6
–ఆర్టీఈ అంశాలు అమలు చేయటానికి పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే చట్టం అమల్లోకి వచ్చిన మూడేండ్లలోపు ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ బడిని నెలకొల్పాలి.1 నుంచి 5 తరగతుల వరకు కిలోమీటర్ దూరంలోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి.6 నుంచి 8 తరగతుల బాలలకు 3 కి.మీ.లోపు పాఠశాలను ఏర్పాటుచేయాలి.తీవ్రమైన వైకల్యంతో బాధపడే బాలలకు రవాణా సౌకర్యా లు ఏర్పాటుచేయాలి. లేకపోతే ఇంటివద్దే విద్యనందించాలి.
*సెక్షన్-7*–చట్టాన్ని అమలుచేసేందుకు నిధులను సమకూర్చే బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది.రెగ్యులర్ పాఠశాలల్లో బోధించే టీచర్లందరికీ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించేందుకు తగిన శిక్షణ ఇవ్వాలి.
*సెక్షన్-8*–ప్రభుత్వ నియంత్రణలో లేని బడిలో పిల్లలను చేర్పించి, ప్రాథమిక విద్యకు పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించాలని అడిగే హక్కు విద్యార్థి తల్లిదండ్రులకు ఉండదు.
*సెక్షన్-9*–తమ ఆవాస ప్రాంతాల్లో పుట్టినప్పటి నుంచి 14 ఏండ్లు వచ్చేవరకు పిల్లలందరి రికార్డులను స్థానిక ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా నిర్వహించాలి.
*సెక్షన్-10*–6 నుంచి 14 ఏండ్లలోపు పిలల్లను పరిసర పాఠశాలలో చేర్పించటం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బాధ్యత.
*సెక్షన్-11* ఆర్ టి ఇ ని ఉల్లంఘించినట్లయితే ఈ చట్టం క్రింద ఇచ్చిన హక్కుల రక్షకాలను, పిల్లల హక్కుల రక్షణ జాతీయ సమితి సమీక్షించి, ఫిర్యాదులను పరిశోధించి మరియు విచారణ చేస్తున్న కేసులలో, సివిల్ కోర్టు పవర్లను కలిగి ఉంటుంది.ఏప్రిల్ 1 నుండి ఆరు నెలలు లోపు, పిల్లల హక్కుల రక్షణ కొరకు ఒక రాష్ట్ర సమితిని (ఎస్ సి పి సి ఆర్) లేదా విద్యా హక్కు రక్షణ అధారిటీ (ఆర్ ఇ పి ఎ) ని రాష్ట్రాలు నియమించాలి. స్థానిక అధికారు లకి, ఏ వ్వక్తి అయినా ఒక సమస్యని ఫైల్ చేయాలనుకుంటే, వ్రాత పూర్వకంగా ఫిర్యాదును అందించాలి.ఎస్ సి పి సి ఆర్/ఆర్ ఇ పి ఎ చే విన్నపములు నిర్ణయించబడతాయి.సముచితమైన ప్రభుత్వముచే అధికారం ఇవ్వబడిన ఆఫీసర్ యొక్క ఆమోదం ఫిర్యాదుల పరిశీలనకు అవసరం.
*అధ్యాయం-4*
*సెక్షన్-12*–బడులు ప్రభుత్వ గ్రాంట్లు ఎంతశాతం పొందుతున్నాయో బడిలో చేరిన పిల్లల్లో అంతశాతం మందికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. కనీసం 25 శాతానికి తగ్గకుండా పిల్లలను బడిలో చేర్చుకోవాలి.కేంద్రీయ, నవోదయ, సైనిక పాఠశాలలు విద్యార్థుల సంఖ్యలో 25శాతం సీట్లు బలహీనవర్గాలకు, ప్రతికూల పరిస్థితులు ఉన్న పిల్లలకు కేటాయించాలి.
*సెక్షన్-13*–బాలబాలికలను బడిలో చేర్చుకోవటానికి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు. బడిలో చేర్చుకొనేందుకు ఎలాంటి ఎంపిక పరీక్ష నిర్వహించరాదు. అనుమతి లేకుండా పరీక్ష నిర్వహిస్తే జరిమానా విధిస్తారు.
*సెక్షన్-14*–వయసు ధ్రువీకరణ పత్రం లేదన్న కారణంతో బడిలో ప్రవేశాన్ని తిరస్కరించరాదు.
*సెక్షన్-15*–విద్యాసంవత్సరంలో బడిలో ప్రవేశానికి సాధారణంగా జూన్ 12 నుంచి ఆగస్టు 31వరకు గడువు ఉంటుంది. గడువు తర్వాత ప్రవేశం కోరినా తిరస్కరించకూడదు.
*సెక్షన్-16*–బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యేవరకు బడి నుంచి తొలగించకూడదు.
*సెక్షన్-17*–బాలలను శారీరకంగా గానీ, మానసికంగా గానీ వేధించరాదు. అలాంటి చర్యలకు పాల్పడిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
*సెక్షన్-18*–ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలను స్థాపించకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించినవారు శిక్షార్హులు.
*సెక్షన్-19*–షెడ్యూల్‌లోని నియమాలను పాటించని పాఠశాలలకు గుర్తింపు ఇవ్వకూడదు. ఈ చట్టం అమలుకు ముందే స్థాపించిన పాఠశాలలు చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మూడేండ్లలోపు తమ సొంత ఖర్చులతో షెడ్యూల్‌లోని నియమనిబంధనల మేరకు సౌకర్యాలు ఏర్పాటుచేయాలి.
*సెక్షన్-20*–షెడ్యూల్‌లోని నియమాలు, ప్రామాణికాలు తొలగించటం, కొత్తగా చేర్చటం లేదా సవరణ చేయటం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది.
*సెక్షన్-21*–అన్ ఎయిడెడ్ పాఠశాలలు తప్ప ప్రతి పాఠశాలలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, బడిలోని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటుచేయాలి. కమిటీ మొత్తం సభ్యుల్లో 50 శాతం మహిళలు ఉండాలి. ఈ కమిటీకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా ఉండాలి.
*సెక్షన్-22*–పాఠశాల యాజమాన్య కమిటీ ఏటా నవంబర్‌లో పాఠశాల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలి.
*సెక్షన్-23*–ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
*సెక్షన్-24*–ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలు పూర్తిచేయాలి.
*సెక్షన్-25*–షెడ్యూల్‌లో నిర్ధారించిన విధంగా విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
*సెక్షన్-26*–ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి. మొత్తం ఉపాధ్యా య పోస్టుల్లో ఖాళీలు పదిశాతానికి మించకుండా చూడాలి.
*సెక్షన్-27*–జనాభా గణన, ఎన్నికల విధులకు తప్ప ఉపాధ్యాయులను ఏ విద్యేతర పనులకు వినియోగించరాదు.
*సెక్షన్-28*–ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్స్, ప్రైవేటు బోధన పనులు చేయరాదు.
*అధ్యాయం-5*
సెక్షన్-29–బాలల జ్ఞానం, సామర్థ్యం, నైపుణ్యాలు పెంపొందించి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని నిర్ధారించి పూర్తిచేయాలి.
*సెక్షన్-30*–ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు బాలలు ఎలాంటి బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు.
*అధ్యాయం-6*
*సెక్షన్-31*–విద్యపై బాలలకు ఉన్న హక్కులను పరిశీలించి, కాపాడే ఏర్పాట్లను సమీక్షించి సమర్థవంతంగా అమలయ్యేందుకు తగిన సూచనలు చేసి బాలల హక్కులను పర్యవేక్షించాలి.
*సెక్షన్-32*–విద్యాహక్కు చట్టం ఉల్లంఘనకు గురైన పక్షంలో ఎవరైనా స్థానిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.
*సెక్షన్-33, 34*–బాలల హక్కుల రక్షణకు జాతీయ, రాష్ట్ర సలహా సంఘాలను ఏర్పాటుచేయాలి.
*అధ్యాయం-7*
*సెక్షన్-35*–చట్టం అమలు కోసం సంబంధిత ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు, ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది.
*సెక్షన్-36*–శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాతే ప్రాసిక్యూషన్ చేపట్టాలి.
*సెక్షన్-37*–సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ కల్పించాలి.
*సెక్షన్-38*–చట్ట నియమాలు రూపొందించటానికి సంబంధిత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతి బాల, బాలికలకు ఉచిత & నిర్బంధ విద్య హక్కు ఉంది. విద్యా హక్కు చట్టం 2009, ఆర్టికల్ 21A & 86వ సవరణ లో విద్యా హక్కు ఆర్టికల్ 21 A ప్రకారం..
విద్యా హక్కు ప్రజాస్వామ్యం యొక్క సాధారణ అభివృద్ధికి మరియు సమర్థవంతమైన కార్యాచరణకు ఇది చాలా అవసరం
ఇది రాజ్యాంగంలోని నిబంధన III ద్వారా రక్షించబడిన విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది . విద్యా హక్కు చట్టం , 2009, కొన్నిసార్లు RTE చట్టంగా సూచించబడుతుంది, ఆగష్టు 4, 2009న భారత పార్లమెంట్ ఆమోదించింది మరియు 2010లో అమలులోకి వచ్చింది.
విద్యా హక్కు నేపథ్యం
1947లో భారతదేశం బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందినప్పుడు జనాభాలో అత్యధికులు నిరక్షరాస్యులు మరియు అత్యంత పేదవారు, మరియు రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నరు.
సార్జెంట్ కమీషన్ 1944, చివరి బ్రిటీష్ ఎడ్యుకేషన్ కమీషన్,40 సంవత్సరాలలో లేదా 1985 నాటికి సార్వత్రిక విద్య అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది.ఇది 3 నుండి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యతో కూడిన వ్యవస్థ కోసం యేర్పాటు చేసారు.కింద పేర్కొన్న విధంగా 6-11 (జూనియర్ బేసిక్) మరియు 11-14 (సీనియర్ బేసిక్) పిల్లలందరికీ సార్వత్రిక, నిర్బంధ మరియు ఉచిత ప్రాథమిక ప్రాథమిక విద్య , సీనియర్ బేసిక్ లేదా మిడిల్ స్కూల్ మెజారిటీ విద్యార్థుల పాఠశాల కెరీర్‌లో చివరి దశ.
నిజానికి అమలులోకి వచ్చిన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 45, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రం , రాజ్యాంగం ఆవిర్భవించిన పదేళ్లలోపు ప్రతి చిన్నారికి పద్నాలుగేళ్ల వరకు ఉచిత మరియు తప్పనిసరి విద్యను అందజేయడానికి రాష్ట్రం ప్రతి సహేతుకమైన మార్గాలను ఉపయోగించాలని సూచించింది.రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు "న్యాయస్థానంలో అమలు చేయదగినవి" కావు, అయితే చట్టాలను ఆమోదించేటప్పుడు వాటిని ఉపయోగించమని రాష్ట్రం ఒత్తిడి చేయబడుతుంది, ఎందుకంటే "దేశ పాలనలో అందులో పేర్కొన్న సూత్రాలు ముఖ్యమైనవి" రాజ్యాంగం.ప్రాథమిక విద్యా సౌకర్యాలను విస్తరించడానికి, ముఖ్యంగా అభివృద్ధి చెందని ప్రాంతాలలో, మరియు ప్రాథమిక విద్యపై దృష్టి సారించి ఉచితంగా మరియు తప్పనిసరిగా అందించడం ద్వారా ప్రతి వ్యక్తికి విద్యను అందుబాటులో ఉంచడానికి, 1976 నాటి భారత రాజ్యాంగంలోని 42వ సవరణ విద్యను  ఏకకాలిక ఆందోళనగా ప్రకటించింది.
సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించే లక్ష్యంతో, సర్వశిక్షా అభియాన్ [అందరికీ విద్య కోసం జాతీయ ప్రచారం] జాతీయ గొడుగు కార్యక్రమం 2000లో ప్రారంభించబడింది.
అంతిమంగా, 2002 రాజ్యాంగం (ఎనభై ఆరవ సవరణ) చట్టం ఆర్టికల్ 21Aని ప్రవేశపెట్టింది, ఇది న్యాయ పరిశీలనకు లోబడి ఉండే ప్రాథమిక హక్కు. బాల్య సంరక్షణ మరియు విద్య.
ప్రాథమిక హక్కులుగా విద్యాహక్కు
రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు ఆర్టికల్ 45 ప్రకారం సార్వత్రిక విద్యను కలిగి ఉన్నాయి మరియు రాజ్యాంగ సభ సభ్యులు దాని ప్రాముఖ్యతను గుర్తించినప్పటికీ, నిధుల కొరత కారణంగా వారు దానిని ప్రాథమిక హక్కుగా హామీ ఇవ్వలేకపోయారు.
1993లో ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో, భారతీయ కోర్టు వ్యవస్థ విద్యాహక్కును జీవించే హక్కులో ఒక అంశంగా చేర్చడానికి ప్రయత్నించింది. 2002లో రాజ్యాంగంలో కొత్త ఆర్టికల్ 21Aని చొప్పించడం ద్వారా ఆమోదించబడిన రాజ్యాంగ సవరణ ద్వారా భారత పార్లమెంటు దేశ భావి పౌరులకు విద్యను పొందే హక్కును కూడా కల్పించింది.
విద్యా హక్కు చట్టం, 2009, కొన్నిసార్లు RTE చట్టంగా సూచించబడుతుంది, ఆగష్టు 4, 2009న భారత పార్లమెంటు ఆమోదించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21Aలో పేర్కొన్న విధంగా 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల భారతీయ పిల్లలు తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్యను పొందాలి...ఈ చట్టాన్ని ఏప్రిల్ 1, 2010 నుండి అమలులోకి తీసుకురావడం ద్వారా, ప్రతి పిల్లవాడికి విద్యపై ప్రాథమిక హక్కు ఉందని ప్రకటించిన 135 దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది.
విద్యా హక్కుకు సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ జాబితా...ఆర్టికల్ 21A 86 వ రాజ్యాంగ సవరణ చట్టం 2002, రాజ్యాంగంలోని పార్ట్ IIIలో ఈ కొత్త ఆర్టికల్‌ను చొప్పించింది, "చట్టం ద్వారా నిర్ణయించబడిన 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ రాష్ట్రం ఉచిత & నిర్బంధ విద్యను అందిస్తుంది".
ఆర్టికల్ 15 భారత రాజ్యాంగం జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించింది. అయితే, ఆర్టికల్ 15(3) ప్రకారం, ఈ నిబంధనలో ఏదీ రాష్ట్రాన్ని మహిళలు మరియు పిల్లల కోసం నిర్దిష్ట చర్యలు తీసుకోకుండా ఆపలేదు.
ఆర్టికల్ 38 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 ప్రకారం, ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే ఏ సామాజిక నిర్మాణం అయినా రక్షించబడుతుంది.
ఆర్టికల్ 45 ప్రకారం. 6సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ & విద్యను రాష్ట్రం అందించాలి.
ఆర్టికల్ 29(2) ఏ పౌరుడు వారి మతం, జాతి, కులం, భాష లేదా ఈ కారకాల కలయిక కారణంగా ప్రభుత్వం నిర్వహించే విద్యా సౌకర్యాలు లేదా రాష్ట్ర డబ్బు నుండి ఆర్థిక సహాయం పొందేందుకు నిరాకరించబడదని ఇది హామీ ఇస్తుంది.
ఆర్టికల్ 30 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ఏ రకమైన సంస్థనైనా స్థాపించడానికి మరియు నిర్వహించడానికి అల్పసంఖ్యాక భాషా మరియు మత సమూహాలకు రక్షణ హామీ ఇస్తుంది.
86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002
6 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యకు ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేయడానికి, 2002 నాటి 86వ సవరణ చట్టం రాజ్యాంగంలో మూడు స్పష్టమైన విభాగాలను జోడించింది. ఈ సవరణ యొక్క లక్ష్యం విద్యపై పౌరుల హక్కులను కాపాడటం మరియు భారతదేశ విద్యాపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవడం.
భారత రాజ్యాంగంలోని పార్ట్ IIIలో ఆర్టికల్ 21A చేర్చడం, కొన్ని ప్రాథమిక నిబంధనలు మరియు ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అధికారిక పాఠశాలలో తగిన మరియు సమానమైన నాణ్యతతో కూడిన పూర్తి-సమయ ప్రాథమిక విద్యను పొందే హక్కు ప్రతి చిన్నారికి ఉందని పేర్కొంది.
కానీ ఈ విద్యాహక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటూ పేద మధ్యతరగతి ప్రజల డబ్బును అడ్డగోలుగా దోచుకుంటుంది.

*జై భీమ్ జై భారత్*

                  *ఇట్లు*
      *ఇటికాల అంబేద్కర్*
         *ప్రధాన కార్యదర్శి*
*బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా*
✊✊✊📘🖊️✊✊✊

No comments:

Post a Comment