Friday, June 30, 2023

రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శ్యాముల్ ఇంట్లో చోరీ కేసులో కొత్తకోణం....!

*రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శ్యాముల్ ఇంట్లో చోరీ కేసులో కొత్తకోణం....!*

హైదరాబాద్ : రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఎస్సై కృష్ణను అదపులోకి తీసుకోనిలో పోలీసులు విచారిస్తున్నారు.ఈ చోరీ కేసులో ఎస్సై కృష్ణ సూత్రదారిగా అధికారులు గుర్తించారు. సురేందర్ ను విచారించడంతో వెలుగులోకి ఎస్సై కృష్ణ వ్యవహారం వచ్చింది. సురేందర్ అనే వ్యక్తితో కలిసి 100 కోట్ల ఆస్థి కొట్టేసేందుకు ఎస్సై కృష్ణ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.ఎస్సై కృష్ణను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశాడు. మే 30న శామ్యూల్ కు సురేందర్ మత్తు మందు ఇచ్చాడు.. శామ్యూల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లను సురేందర్ చోరీ చేశాడు. 40 ల్యాండ్ డాక్యుమెంట్లు, 5 లక్షల నగదుతో పాటు 30 తులాలు బంగారాన్ని సురేందర్ దోపిడీ చేశాడు. డాక్యుమెంట్లు దుండిగల్ ఎస్సై కృష్ణకు ఇచ్చిన సురేందర్ విచారణలో ఒప్పుకున్నాడు. సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ను పోలీసులు సేకరించారు. చోరీ చేసిన డబ్బులతో సురేందర్ గోవా వెళ్లి క్యాసినో ఆడినట్లు అంగీకరించాడు. గతంలో సైతం క్యాసినోకు బానిసై సురేందర్ అప్పుల పాలైనట్లు తెలిపాడు. ఎస్సై కృష్ణా, సురేందర్ ల అక్రమ దందాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఓ భూమి విషయంలో రిటైర్ శామ్యూల్ ఎస్సై కృష్ణకు మధ్య వివాదం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో శామ్యూల్ ఆస్తిని మొత్తం కొట్టేసేందుకు ఎస్సై ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment