Thursday, June 15, 2023

రాజస్థాన్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై వేటు

*అర్ధరాత్రి విందు కోసం... హోటల్ సిబ్బందిపై దాడి!*

*రాజస్థాన్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై వేటు*

*రాజస్థాన్...!*
అజ్‌మేర్‌ సమీప రెస్టారెంటులో అర్ధరాత్రి జరిగిన గొడవ తాలూకు సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ కావడంతో ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను సస్పెండు చేసింది.వీరితోపాటు మరికొంతమంది సిబ్బందిపైనా సస్పెన్షన్‌ వేటు పడింది. ఐఏఎస్‌ అధికారి గిరిధర్‌ అజ్‌మేర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌గా ఉన్నారు. గంగాపుర్‌ సిటీ పోలీసు విభాగానికి ఐపీఎస్‌ అధికారి సుశీల్‌కుమార్‌ బిష్ణోయ్‌ ఓఎస్‌డీగా నియమితులయ్యారు. ఈ కొత్త నియామకాన్ని పురస్కరించుకొని విందు చేసుకునేందుకు అర్ధరాత్రి రెస్టారెంటుకు వెళ్లి గొడవ పడ్డారు.

''ఆదివారం అర్ధరాత్రి దాటాక ఆ ఇద్దరు అధికారులు స్నేహితులతో కలిసి వచ్చారు. సిబ్బందిని నిద్ర లేపి గొడవకు దిగారు. నాకు సమాచారం అందగానే.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. నా ఫిర్యాదు అందుకున్న పోలీసులు అదే ఐపీఎస్‌ అధికారితో కలిసివచ్చి కర్రలు, ఇనుప రాడ్లతో మావాళ్లపై దాడి చేశారు. 11 మంది గాయపడ్డారు'' అని రెస్టారెంట్‌ యజమాని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై వేటు పడింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment