*_అందరి చూపు మెఘా వైపే.!_*
_★ ఆడిట్ లో ఎన్నో అభ్యంతరాలు_
_★ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగింది_
_★ అసలు దొంగలు దొరికేనట్టేనా..?_
Courtesy by : _(అనంచిన్ని వేంకటేశ్వరరావు
దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 9440000009)_
*_కేంద్రం నటిస్తోందా..? జీవిస్తుందా.? అన్నది ఓ నేల రోజుల్లో తేలిపోనున్నది. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు. ఇకముందు జరగబోయోది ఒక ఎత్తు. ఇక భాజపా, భారస మధ్య దాగుడుమూతలకు కాలం చెల్లినట్లే. ఈ రెండు పార్టీల మధ ఆర్థక బంధాలకు నెలవైన 'మెఘా' కాంట్రాక్టుల లోగుట్టు రట్టు కానున్నదా.? చీకటి ఒప్పందాలతో యథాతథంగా పాతరేయబడుతుందా..? అన్నది కాలం తేల్చనున్నది. మొత్తం వ్యవహారం అంతా మెఘా కృష్ణారెడ్డి సంస్థల వైపు అడుగులు పడటం గమనార్హం. గుట్టుగా జరుగుతున్న ఈ' ఆడిట్ రిప్లై'పై 'ఘంటారావం' అందిస్తున్న ప్రత్యేక కథనం._*
*https://m.facebook.com/story.php?story_fbid=pfbid02rTUEmHWjDeuSG95RNhgnii5YuisjBrmdesw6AKGYL2ypbQdFXsFFNjZ84w7Fq84Zl&id=100063772548665&mibextid=Nif5oz*
*_అసలేం జరిగింది..?:_*
కాళేశ్వరం ప్రోజెక్టులో అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)కు గతంలో అందిన ఫిర్యాదులపై ఆడిట్ చేయటం కోసం రంగంలోకి దిగింది. ఆ మేరకు వివరాలు కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ పంపింది. దీనికి సమాధానం చెప్పటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్దండ పిండాలనే రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆడిట్ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం నుంచి సంబంధిత అధికారులు కసరత్తులు మొదలెట్టారు. ఈ మొత్తం తంతు అంతా కాళేశ్వరం ప్రోజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన మెఘా సంస్థ వైపే చూడటం గమనార్హం.
*_డిజైన్ల మార్పు ఎవరికిలాభం...?:_*
డిజైన్లు మార్చడానికి గల కారణాలు, అందుకు అయిన అదనపు వ్యయం, కాంట్రాక్టర్ పాత్ర గురించి, వారికి అదనంగా ఎంత వరకు లాభించింది
*_అంచనాలు అంతగా పెరగటానికి కారణం ఎవరు..?_*
ప్రాజెక్ట్ వ్యయం రూ. 40,000 కోట్ల నుండి లక్ష కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఎంత.?
*_దారిమళ్ళిన నిధులు ఎన్ని..?_*
జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం రూ. గత నాలుగేళ్లలో 3982 కోట్లు ఇచ్చింది. పీఎంకేఎస్‌వై, ఏఐబీపీ, సీఏడబ్ల్యూఎం పథకాల కింద కేంద్రం రూ. 1195 కోట్లు ఇచ్చింది. పేర్కొన్న ఆయన ఇతర కేంద్ర నిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. 1,15,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎందుకు ప్రభుత్వం దారి మళ్లించింది.
*_ఎందుకు అప్పగించారు..?_*
ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు అప్పగించటం గురించి.
*_105 మిషన్ల మతలబు ఏమిటి..?_*
కాళేశ్వరం ప్రాజెక్టులో 120 మిషన్లకు బదులు 105 మిషన్లు అమర్చి 20 పంప్ హౌస్ లకు బదులు 17 పంప్ హౌస్ లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కన్నెపల్లి పంప్ హౌస్ లోకి వరద నీరు వచ్చి 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయినట్లు అధికారులు గుర్తించారు.
*_అప్పు ఎంత.? ఎందుకు తెచ్చారు..?:_*
ఈ ప్రోజెక్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కు తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా 97, 447కోట్లుగా తేలింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో వివిధ బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భారీగా అప్పులు ఇచ్చాయి.
*_ఫోకస్ ఎందుకు.:_*
అధికారుల బృందం... నిర్మాణ వ్యయం, మోటార్లు, పంపులు, ఇతర హైడ్రో ఎలక్ట్రికల్ పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు. కేసీఆర్ సర్కార్ చేపట్టిన మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులపైనే ఎక్కువగా ఫోకస్
*_పరిహారంలో ఈ సమస్యలు ఏమిటి..?:_*
భూ నిర్వాసితులకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, ఇంకా ఎంత భూమి సేకరించాల్సి ఉందనే వివరాలు కావాలని కోరిందట. మూడో టీఎంసీ అంచనా వ్యయం, పనుల పురోగతి, మూడో టీఎంసీతో కలిగే ప్రయోజనాలు కూడా కాగ్ బృందం అడిగిందట.
No comments:
Post a Comment