*హైదరాబాద్కు ఎల్లో అలర్ట్*
*టెంపరేచర్ 11 డిగ్రీలకు పడిపోయే అవకాశం*
*రేపటి నుంచి విపరీతంగా మంచు కురిసే చాన్స్*
*సిటీవాసులు అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ శాఖ*
హైదరాబాద్‌లో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. సుమారు 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు సిటీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, సిటీవాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ముఖ్యంగా సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. పొగమంచు కారణంగా ఉదయం, సాయంత్రం ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక యాక్సిడెంట్లు జరిగే చాన్స్ ఉందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, పిల్లలు, పెద్దలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బుధవారం15 డిగ్రీలు, గురువారం 12 డిగ్రీలు, శుక్రవారం 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment