*రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు....కోర్టులు కలగజేసుకోవచ్చు*
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) తీరుపై తెలంగాణ సర్కార్ హైకోర్టు ను ఆశ్రయించింది. బడ్జెట్ ను ఆమోదించడంలేదంటూ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.పిటిషన్‌ను విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ ధవే వాదనలు వినిపించారు.
*దుష్యంత్ ధవే వాదనలు.....!*
రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు కలగజేసుకోవచ్చునని, 1974లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఆర్టికల్ 174, 153 ప్రకారం గవర్నర్ విధులను ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉంటుందన్నారు. పలు సుప్రీంకోర్టు కాపీలను ప్రస్తావించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి గవర్నర్‌ను సంప్రదించారని.. అయినా గవర్నర్ సంతకం చేయలేదని అన్నారు. అసెంబ్లీలో తన ప్రసంగం ఉందా అని గవర్నర్ అడిగారని, కోర్టుకు రావడం ... గవర్నర్‌పైనే పిటిషన్ దాఖలు చేయటం తమ ఉద్దేశం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
కాగా వాదనలు ప్రారంభంకాగానే న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారని ధర్మాసనం దుష్యంత్ ధవేను ప్రశ్నించింది. ఇలాంటి విషయాల్లో మేము కలగజేసుకుంటే కోర్టు పరిధి దాటి వ్యవహరిస్తుందని మీరే అంటారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వాదనలు కొనసాగుతున్నాయి. భోజన విరామం సమయం కావడంతో తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment