Monday, January 23, 2023

ఇంకా ఇరవై మూడేనా....!

ఇంకా ఇరవై మూడేనా...!
లెటేస్ట్ సర్వే రిపోర్ట్ లో కారు స్పీడెంత .?
20 మంది సిట్టింగులపై ఎర్రబెల్లి కామెంట్స్
20 కాదు 40 మంది ఎమ్మెల్యేలకు నో టికెట్.?
అభ్యర్థుల షార్ట్ లిస్ట్ రెడీ చేసిన కాక
బీజేపీ, కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఖరారు అయ్యాక ప్రకటించే ఛాన్స్
శనార్తి తెలంగాణ, హైదరాబాద్ :
ఏడాది కిందే కారు సర్వీస్ కు వచ్చిన సంగతి తెలిసిందే. స్పీడు ఏకంగా 23కి పడిపోయిందని క్లారిటీ వచ్చింది. పీకే ఇచ్చిన సర్వే రిపోర్టులో, సీఎం కేసీఆర్ సొంతంగా చేయించుకున్న సర్వేలోనూ ఇదే తేటతెల్లం అయింది. కట్ చేస్తే.. సిట్టింగులకు నో టికెట్లు అనే స్టేట్మెంట్ల నుంచి మళ్లీ సిట్టింగులకే సీట్లు అనే స్పష్టత దాకా కేసీఆర్ యూటర్న్ రాజకీయాలు నడిశినయి. మరీ.. ప్రస్తుతం కారు స్పీడెంత అంటే.. ? గదే 23 బిలో అంటున్నయి లేటెస్ట్ సర్వేలు. అంతేకాదు.. ఇంకా ఆలస్యం చేస్తే.. పదికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశినయని సమాచారం. ఈ నేపథ్యంలోనే ముందస్తుకు పోవడంతో పాటు.. మళ్లీ సిట్టింగులకు సీట్లు ఇస్తానని చేసిన ఒట్టుని తీసి గట్టుమీద పెట్టే పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు అంత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.
ఈ క్రమంలోనే కోవర్టు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ముద్రపడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కాక రంగంలోకి దింపినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది సిట్టింగ్ లను మార్చితే 100 సీట్లు గ్యారంటీ అని ఇటీవల ఎర్రబెల్లి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ చేయించిన లేటెస్ట్ సర్వేలతో పాటు, పీకే ఇచ్చిన తాజా సర్వేలోనూ.. పార్టీ చరిష్మా తగ్గిందని తేలిందని టాక్. దీనికి మళ్లీ సిట్టింగులకే సీట్లు అనే స్పష్టత ఓ కారణమని చెబుతున్నారు. ఎర్రబెల్లి కేవలం 20 మంది సిట్టులను మార్చితే .. 100 గెలుస్తం అన్నారు. కానీ 20 కాదు 40 మందికి నిరాశ తప్పదని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్ లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారని చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు నో టికెట్లు అనే సంకేతాలు ఏడాది క్రితమే గులాబీ పార్టీ నుంచి వెలువడ్డాయి. ఐతే రోజురోజుకు పుంజుకుంటున్న బీజేపీ సిట్టింగులకు మరో బలమైన ఆప్షన్ గా మారింది. ఎన్నికలకు ఆర్నేళ్ల ముందే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కమలం పార్టీలో టికెట్ బుక్ చేసుకునే వరకు పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ పార్టీ విస్తృతస్థాయి వేదికగా మళ్లీ సిట్టింగులకే సీట్లు అనే స్పష్టత ఇచ్చారు. దీంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం మానేసి.. సొంత నియోజకవర్గంలో మరోసారి ఓట్లు అడుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వాళ్లు ఎన్ని రకాలుగా కింద మీద పడ్డా ఈసారి గెలిచే అవకాశాలు లేవని లేటెస్ట్ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి తో కాక 20 మందికి టార్గెట్ ఫిక్స్ చేసినట్లు కనబడుతుంది.
ఆఖరి నిమిషయంలో ఆగం చేసే పని :
సిట్టింగులలో చాలా మందికి టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారు. కాకపోతే.. హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడే కాదు. బీజేపీ, కాంగ్రెస్ లలో నియోజకవర్గాల వారీగా ఓ జాబితా రెడీ అయినా తర్వాత.. సిట్టింగులకు నో టికెట్.. మళ్లీ అధికారంలోకి వస్తే.. నామినేటెడ్ పోస్టుల పేరిట చల్లబరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది. మొత్తానికి.. కేసీఆర్ ను నమ్మి మరోసారి టికెట్ ఖాయమని ధీమాగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఘోరాతి ఘోరంగా మోసపోబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త.. అంటూ శనార్తి తెలంగాణ హెచ్చరిస్తున్నది.

Courtesy by : Q న్యూస్ మీడియా 

No comments:

Post a Comment