*కోర్టు దిక్కరణ కేసు మంత్రి పువ్వాడ కు.... హైకోర్టు నోటీసులు!*
హైదరాబాద్: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు నోటీసు పంపింది. మమతా మెడికల్ కాలేజీ ఛైర్మన్ హోదాలో ఉన్న ఆయన విద్యార్థుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులు తిరిగి ఇవ్వనందుకు చర్యలు తీసుకుంది.పీజీ వైద్య కోర్సులకు విద్యార్థుల నుంచి 2017 జీవో ప్రకారం పెంచిన ఫీజులు తీసుకుంది మమత కాలేజీ. 2016 జీవో ప్రకారం పాత ఫీజు తీసుకోవాలని వైద్య కళాశాలలకు హైకోర్టు గతేడాది ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల నుంచి కాలేజీలు వసూలు చేసిన అధిక ఫీజు తిరిగి ఇవ్వాలని చెప్పింది.
అయితే మమత మెడికల్ కాలేజీ తమకు రావాల్సిన ఫీజు తిరిగి ఇవ్వడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలని పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసు పంపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment