*నిజాం రాజు ముకరం జాకు సీఎం కేసీఆర్ నివాళులు....!*
హైదరాబాద్: హైదరాబాద్ సంస్థానం 8వ నిజాం రాజు బర్కత్ అలీ ఖాన్ ముకరంజా బహదూర్ (89) టర్కీలో మరణించిన విషయం తెలిసిందే.
అనంతరం, సోమవారం ముకరంజా పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. సోమవారం సాయంత్రం ముకరంజా పార్థీవ దేహాన్ని చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచారు.కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ముకరంజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చౌమహల్లా ప్యాలెస్‌కు వెళ్లిన కేసీఆర్.. నిజాం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడున్న వారితో కాసేపు మాట్లాడారు. ఇదిలా ఉండగా.. ప్రజల సందర్శనార్థం రేపు ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు ముకురం జా పార్థీవ దేహాన్ని అక్కడే ఉంచనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మక్కా మసీదులో ముకరం జా అంత్యక్రియలు జరుగనున్నాయి. మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల ప్రాంగణంలో ముకరంజా ఖననం కోసం నిజాం ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న నిర్వహించే ముకరంజా అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు సోమవారం పరిశీలించారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment