*NTR కు నారా నందమూరి కుటుంబ సభ్యుల నివాళులు!*
హైదరాబాద్ : ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. నారా భువనేశ్వరి, బాలకృష్ణ, రామకృష్ణ, సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమన్నారు. టీడీపీ రూపంలో ఎన్టీఆర్ తమకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని బాలయ్య పేర్కొన్నారు.
సుహాసిని మాట్లాడుతూ... అందరం కలిసి పార్టీకి పునర్వైభవం తీసుకువద్దామని సుహాసిని కోరారు. ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాముడైనా, రావణ బ్రహ్మ అయినా ఎన్టీఆరేనన్నారు. ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ''ఆరాధ్య కథానాయకుడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి. నటుడిగా ఎన్టీఆర్ అనేక చారిత్రాత్మక చిత్రాలు నిర్మించారు. 1982 లో ప్రజలకు సేవ చేసేందుకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ కృషి చేశారు. ఎన్టీఆర్ ప్రపంచ స్థాయికి తెలుగు వారి కీర్తిని ఇనుమడించారు. ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది అందరికీ గర్వకారణం'' అని పేర్కొన్నారు.
*సుజీవన్ వావిలాల🖋️*
No comments:
Post a Comment