హైదరాబాద్ : 03/01/2021
అందరికి నమస్కారం 🙏
*ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలి. కానీ ప్రస్తుతం తెలంగాణ లో ఆలా జరగడం లేదు. కావున ప్రజలారా మీరందరు మీ మీ గ్రామములోని యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మీ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా సంకల్పం తీసుకోవాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను 🙏*
*మొత్తం తెలంగాణ లో మీడియాను ప్రభుత్వం భయపెట్టి తన ఆధీనంలో తీసుకుంది (కొన్ని మీడియా సంస్థల యజమానులు ప్రభుత్వానికి అమ్ముడు పోయారు ఇది వాస్తవం).ప్రజలకోసం ఆలోచించే జర్నలిస్ట్లు నిశ్శబ్దంగా ఉండిపోవాల్సి వస్తుంది వారి వారి యాజమాన్యాల వల్ల. అందుకే తెలంగాణ లో మళ్ళీ ప్రజా యొద్దం మొదలైంది దుబ్బాక ఎన్నికలనుంచి... ఈ ఉద్యమం ఆగదు మీరు కూడా ప్రజా ప్రయోజనాలకోసం ఉద్యమించండి. సోషల్ మీడియా వుంది కాబట్టి సరిపోయింది లేకపోతే తెలంగాణ లో రజాకార్ల పాలన & కుటుంబ పాలనలకు అడ్డు అదుపు లేకుండా పోయేది.ప్రజల పక్షాన Q న్యూస్ తీన్మార్ మల్లన్న, రాజన్యూస్, యూనివర్సిటీ విద్యార్థులు... ముఖ్యంగా నిజమైన ఉద్యమకారులు ఇలాంటి ప్రశ్నించే గొంతులు వున్నాయి కాబట్టి సరిపోయింది.*
ముఖ్యగమనిక :
*మండలం మీద మీ మీ వాస్తవ అభిప్రాయాలు మీ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారిని కలుపుకొని (ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు ముఖ్యం ప్రజల మనోభావాలు ముఖ్యం) అతని లెటర్ హెడ్ మీద మీ అందరి సంతకాలు & ఫోన్ నెంబర్ సేకరించి (ప్రతి ఒక్కరు కూడా) భారత దేశ గౌరవనీయులైన రాష్ట్రపతి సర్ గారికి మరియు ఉపరాష్ట్రపతి సర్ గారికి మరియు ప్రధానమంత్రి సర్ గారికి మరియు తెలంగాణ గవర్నర్ మేడం గారికి పోస్ట్ ద్వారా తక్షణమే వాస్తవాలు పంపియగలరు🙏*
*భారత రాజ్యాంగం మనకు కల్పించిన న్యాయమైన హక్కులను మనమందరం న్యాయంగా సద్వినియోగం చేసుకోవాలి*
*ఇట్లు*
మీ శ్రేయోభిలాషి
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment