హైదరాబాద్ : 23/01/2021
*జాతికే అంకితమై ఉద్యమం నడిపిన ఘనచరిత గలిగిన మహనీయులెందరెందరో*
*బ్రిటీష్ వారి గుండెల్లో సింహ స్వప్నం స్వాతంత్ర్య సమరంలోకి దూసుకెళ్లిన బోస్ గారు యువతకు చక్కని స్ఫూర్తి జైలు శిక్షలకు వెరువని త్యాగ మూర్తి*
*అనారోగ్యాన్ని అరికాలు కింద తొక్కిపెట్టి ఉద్యమ కడలిలో ఎదురీదిన ధీశాలి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటు చేసి బ్రిటీష్ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించిన సాహసం ఇతడు*
*ఆయన త్యాగనిరతి నిబద్ధత ధైర్యసాహసాలు ప్రతీ భారతీయుడిలో ఉత్తేజాన్ని రేకిస్తాయి*
*మత తత్వము రూపు మాపడమే భారతీయులు మొదటి కర్తవ్యం అని నొక్కి చెప్పిన వక్త భిన్నత్వంలో ఏకత్వం మన ఆనవాయితీ*
*దీనికి పూర్తిగా కట్టుబడిన వ్యక్తి బోస్ గారు ఉమ్మడి స్వాతంత్ర్యంలో సమైక్యత సమభావం ఉండాలనే ధ్యేయం దాస్య శృంఖాలను తెంచుటకై నడుం కట్టిన బెంగాల్ తేజం*
*శుభాస్ చంద్ర బోస్ ఒక వ్యక్తి కాదు ఉద్యమ శక్తి నేతాజీ అన్న పేరు సుభాష్ చంద్రబోస్ లోనే ఇమిడి పోయింది వెనుదిరగని ధీరత్వానికి అధిపతి*
*నేతాజీ లోని తెగువ ధైర్యం సాహసం నాయకత్వ పటిమ రక్తంలో రంగరించుకొని*
*నేటి యువతేజాలు పిడికిలి బిగించి ప్రతీ ఒక్కరు నేతాజీ ప్రతి రూపాలై ఆజాద్ హింద్ ఫౌజ్ అంటు ఉత్చాహంగా ముందుకు కదలాలి....*
*సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా ప్రజా సంకల్పం & link Media ఘన నివాళులు అర్పిస్తుంది 🙏*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment