*మీ పిల్లలను ఏ స్కూల్లో చేర్పిస్తున్నారో ఒక్కసారి చెక్ చేయండి.*
*అది ప్రభుత్వ గుర్తింపు పొందినదా? లేదా ?*
*తెలంగాణ విద్యా శాఖ కీలక పెచ్చరికలను జారీ చేసింది.*
*అనురాధ రావు అధ్యక్షురాలు - బాలలహక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 19:
హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు,గుర్తింపు లేకుండా పుట్ట గొడుగుల్లా ప్లే స్కూళ్లు, Primary, High school వెలిసాయి. అవి చిన్న చిన్న భవనాల్లో బహుళ అంతస్తుల్లో కనీస వసతులు లేకుండా తగినంత ఆటస్థలం, ఫైర్ సేఫ్టీ లేని పాఠశాలలు 500 పైగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్నాయి.మన విద్యాశాఖ మంత్రి, అధికారుల దృష్టికి వచ్చినా, గాఢ నిద్రలో ఉన్నారు,
వారికి ఏమీ పట్టదు.యధేచ్చగా స్కూళ్లు తమ వ్యాపారాలు చేస్తున్నాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన విధంగా ఉంది.తీసుకున్న జీతానికి న్యాయం చేయండి,పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి.విద్యాశాఖ అధికారులు మీ కుర్చిలనుండి దిగి పాఠశాలల తనిఖీలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం విన్నపం.ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్ల వివరాలను జిల్లాల వారిగా, మండలాల వారిగా అధికారిక పోర్టల్లో అందుబాటులో పొందుపరిచారు. Website:
www.schooledu.telangana,gov.in
మన ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి, చేసేది వేరే. ఆ శాఖ ముఖ్య మంత్రి గారి దగ్గర వుంది. అధిక ఫిజులకు అడ్డుకట్ట వేస్తా అంటున్నారు కానీ దోపిడి చేస్తున్న ఉన్నారు స్కూల్ యాజమాన్యాలకు అడ్డుకట్ట వేయడం లేదు.తల్లిదండ్రులకు విజ్ఞప్తి,ఫీజులు కట్టే ముందు ఒక్క విషయం చెక్ చేయకపోతే మీపిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు.ఒక వేళ గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే ...
* విద్యా ప్రమాణాలు సరిగా ఉండవు
* భద్రతా నిబంధనలు పాటించరు, మీ పిల్లల భద్రత మీదే.
* అర్హత లేని సిబ్బందితో భోధన
* భవిషత్తులో సర్టిఫికెట్లకు సమస్య అవుతుంది.
స్కూల్ రికగ్నిషన్ తప్పనిసరిగా చెక్ చేయండి అధికారిక వెబ్ సైటులో ఆ స్కూల్ పేరు ఉందో లేదో చూడండి.అఫిలియేషన్ వివరాలు తీసుకోండి CBSE, ICSE of State Board ఏదైనా సరే, దానికి సంబంధించిన వివరాలు.స్కూల్ ను స్వయంగా సందర్శంచండి, ప్రకటనలు చూసి మోసపోకండి. తరగతి గదులు, భద్రత,మరుగుదొడ్లు,తాగునీటి సౌకర్యం,ఆట స్థలం, ఫైర్ సేఫ్టీ, ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఎలా ఉంది, ఒక వేళ బస్సు అయితే, ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉందా? బస్సు లో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్, అన్ని అనుమతి పత్రాల గురించి అడగండి.చెల్లించిన డబ్బుకు రసీదులు అన్ని బద్ర పరుచుకోవాలి.అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలి, విద్యాబోధన ఏవిదంగా ఉంది అని. తెలుసుకోవాలి.అన్ని గుర్తింపు పత్రాలు చూడాలి.
పిల్లల విద్య పెట్టుబడి కాదు, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి.స్కూల్ లో చేర్చుకునే సమయం లో పిల్లలకు ఐడి క్రియేట్ చేస్తారు అదే"పెన్"
నెంబర్,11 డిజిట్స్ తో క్రియెట్ చేస్తారు, దీని వల్ల పిల్లల చదువులు ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు ట్రాక్ చేయడానికి, బోర్డు ఎగ్జామ్స్ కు ఉపయెగ పడుతుంది. ఇది క్రియేట్ అయ్యాక 'అపార్' ఐడి క్రియేట్ చేస్తారు,
ఇది ఒక యూనిక్ ఐడి.12 డిజిట్స్ తో ఉంటుంది. ఈ ఐడి లో పిల్లల మార్కులు, వారి అకాడమిక్ రికార్డ్స్, సర్టిఫికెట్స్ అన్ని ఒక డిజి లాకర్ లో డిజిటల్ గా భద్రపరుస్తారు. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్/ అడ్మిషన్ కోసం సులభం అవుతుంది.
One Nation,One student ID అని నేషనల్ ఎజుకెషన్ పాలసీ 2020 ప్రకారం 2023/25 విద్యా సంవత్సరం నుండి ఇది ప్రారంభం అయింది.
No comments:
Post a Comment