*NEET - యూజీ 2026పరీక్ష పేపర్ లీక్ - లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేసింది*
*ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది*
*CBSE 2026 On Screen Marking - OSM విధానంలో లోపాలు*
*అనురాధ రావు - బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 8:
ప్రపంచ సమయాన్ని మార్చే ముందు భూమధ్య రేఖ ఎక్కడ ఉందో మన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి తెలుసా? April నెల 2026 ఉజ్జయినిలో జరిగిన అంతర్జాతీయ "Master of Time సదస్సు" లో ధర్మేంద్ర ప్రదాన్ గారు మాట్లాడుతూ, ప్రపంచం ఇప్పుడు ఉపయోగిస్తున్న Greenwich Mean Time (GMT)
స్థానంలో మహకాల్ స్టాండర్డ్ టైం పరిగణలోకి తీసుకోవాలని సూచించిన మహా మేధావి మన కేంద్ర విద్యాశాఖ మంత్రి .ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే,ఉజ్జయినిలో ఈ భుమధ్య రేఖ మరియు కర్కాటక రేఖ కలుస్తాయని చెప్పారు.అంటే ఎంత మేధావో మన మంత్రి గారు, అవి సమాంతర రేఖలు, భౌగోళికంగా కలిసే అవకాశం లేదు అనే విషయం తెలియదా? అందుకే విద్యాశాఖ మంత్రి అయ్యారు.ప్రపంచ సమయ ప్రమాణాన్ని మార్చడం అనేది అంతంతీయ స్థాయి విషయం అని కూడ తెలియని మేధావి చేతిలో విద్యావ్యవస్థ ఉంది.ఒక దేశ ప్రధాని కాని,మంత్రి కాని ఈ టైం మార్చగలరా? May 3వ తేదిన NEET UG 2026 పరీక్ష నిర్వహించారు,22 లక్షలకు పైగా విద్యార్థులు రాశారు.
ప్రతి సంవత్సరం లాగే పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ కావడం,పరీక్ష రద్దు చేయడం జరిగింది.సంవత్సరాలు మారుతున్నాయి కాని పేపర్ లీకేజీ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ప్రభుత్వం.
పరీక్ష రద్దు,మళ్లి పరీక్ష నిర్వహణ అనే స్థాయికి ఎదిగాం.ఒక పేపర్ లీక్ అంటే లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేయడం.ఎన్ని కుటుంబాలు ఆవేదనకు గురైతాయి? తల్లిదండ్రులు తమ కలలను పిల్లల పై పెట్టుకుంటారు. ఆ కలలు బుడిదైతే బాధ్యత ఎవరిది?.NEET కోసం ఆరవ తరగతి నుండే కోచింగ్ ప్రారంభం అవుతుంది.దానికోసం అధిక ఫీజులు వసూలు చేస్తాయి పాఠశాలలు.ఇంటర్ లో సెపరేట్ కోచింగ్.ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలిసిన విషయమే. ఒక సాధారణ కుటుంబం మళ్లి మళ్లి ఇలా ఖర్చు చేయాలి అంటే ఆ కుటుంబం వీధిన పడ్డట్టు.అటు మానసికంగా, ఇటు ఆర్థికంగా దెబ్బ తింటున్న కుటుంబాలు ఎన్నో.ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇక ఈ సమస్య ఉండగానే CBSE 2026 On Screen Marking - OSM విధానంలో లోపాలు బయట పడ్డాయి. వేల సంఖ్యలో విద్యార్థులు మార్కింగ్ లోపాల పై ఫిర్యాదులు చేశారు.ఒకరి ఆన్సర్ షీట్ వేరే వాళ్ళకు, ఒకరికి ఖాలీ షీట్, ఒక ప్రశ్న కు వేరే ఆన్సర్ అలా రకాల రకాలుగా వచ్చాయి.
ఇక దరఖాస్తుల పేరిట 100 రూపాయలు, వెరిఫికేషన్కు వంద, ప్రశ్నలు చూడాలి అంటే ప్రతి ప్రశ్నకు 25 రూపాయలు ఇలా దోచుకోవడం. అవకతవకలపై విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్నారు - వ్యత్యాసాలు ఉన్నాయి అని కాజువల్ అన్నారు.కాని ఏం చేశారు ఆ తప్పు చేసిన వారిని ?
2019 లో గ్లోబరీనా చేసిన నిర్వాకానికి 25 మంది విద్యార్థులు బలి అయ్యారు. ఇలాంటి
అదే గ్లోబరీనా కంపెనీకే (పేరు మార్చుకున్నా) ఈ On Screen Marking పనిని అప్పగించారు.
ఇట్లా జరిగితే వేరే ఏదేశ ప్రజలైనా నిలదిసే వారు, కాని మన దేశంలో నాకెందుకు అని అనుకోవడం.
ఇదే తమ పిల్లలకు జరిగితే ఊరుకుంటారా? మనకున్న చట్టాలను గౌరవిస్తే ఇన్ని దారుణాలు జరిగేవా? ఇంత మంది విద్యార్థులు చనిపోతే కనీసం బాధ్యత లేని ప్రభుత్వం.
మన ప్రధానమంత్రి కి చదువు గురించి పట్టదు, పిల్లలు ఆశగా మన్ కి బాత్ ప్రోగ్రాం చూస్తే/వింటే ఒక్క మాట కూడ ఈ సమస్యలపై స్పందించలేదు.ఎప్పుడైతే విద్యావ్యవస్థ పై నమ్మకం కోల్పోతామో,భవిష్యత్తు పై నమ్మకం కోల్పోతాం.ఇలాంటి వారు వారి పదవులకు రాజీనామ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్.6వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి నిరసన ప్రదర్శన జరిగింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆ ప్రదర్శన లో బాలల హక్కుల సంఘం తరఫున తమ డిమాండ్ తెలిపింది.సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లల సమస్యల పట్ల మన గొంతు విప్పుదాం. మళ్లి ఇవి పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిదే,కాని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా ఉంది, న్యాయ వ్యవస్థను పటిష్ట చట్టపరమైన చర్య తీసుకోవాలి అని విన్నపం.
No comments:
Post a Comment