*పిల్లల భద్రతే ప్రభుత్వ మొదటి బాధ్యత*
*పిల్లల ప్రాణాల కంటే గొప్పది ఏదీ కాదు - సామజిక కార్యకర్త, న్యాయవాది వి. రవికృష్ణ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 28:
విద్య అనేది వ్యాపారం కాదు... రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు (ఆర్టికల్ 21ఏ) అని సామజిక కార్యకర్త, న్యాయవాది వి. రవికృష్ణ అన్నారు. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లు, ప్రీ-స్కూళ్లు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి విద్యాసంస్థకు చట్టబద్ధమైన గుర్తింపు, భవన భద్రత, ఫైర్ సేఫ్టీ, స్ట్రక్చరల్ స్టెబిలిటీ, పరిశుభ్రత, తాగునీరు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు తదితర తప్పనిసరి ప్రమాణాలు అమలులో ఉన్నాయా అనే అంశంపై సమగ్ర తనిఖీలు అత్యవసరం అని అన్నారు.దేశంలోని ఇతర రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లలో జరిగిన అగ్ని ప్రమాదాలు అమాయక విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నాయి. అలాంటి విషాదాలు తెలంగాణలో జరగక ముందే ప్రభుత్వం, సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. నేను ఈ అంశంపై ప్రజాప్రయోజన ప్రాతినిధ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు సమర్పించాను అని చెప్పారు.
*నా ప్రధాన డిమాండ్లు:*
1. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కూళ్లు & ప్రీ-స్కూళ్లపై ప్రత్యేక తనిఖీలు
2. గుర్తింపు లేని లేదా చట్టపరమైన నిబంధనలు పాటించని విద్యాసంస్థల గుర్తింపు
3. ఫైర్ సేఫ్టీ, భవన భద్రత, మౌలిక వసతులపై ప్రత్యేక ఆడిట్
4. జిల్లా వారీగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచడం
5. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు... ప్రమాదం జరగకుండా నివారించడమే నిజమైన పరిపాలన.పిల్లల భద్రతే ప్రభుత్వ మొదటి బాధ్యత.
No comments:
Post a Comment