*GHMC అంబర్పేట్ సర్కిల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు*
*అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోని GHMC కమీషనర్, సికింద్రాబాద్ జోనల్ కమీషనర్,అంబర్పేట్ డిప్యుటీ కమీషనర్*
*అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను GHMC అధికారులు గౌరవిస్తలేరు - బాపట్ల కృష్ణమోహన్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:
అంబర్పేట్ బాపు నగర్ అంబికా సారీస్ పక్కన నిర్మిస్తున్న నిర్మాణం అక్రమమా? సక్రమమా? అంబర్పేట్ సర్కిల్ డిప్యుటీ కమీషనర్ సమాధానం చెప్పాలి.ఐదు ఫ్లోర్లు పెంట్ హౌస్ కూడా వేశారు.అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.ఐదు ఫ్లోర్లు & పెంట్ హౌస్ వేసే దాకా GHMC అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు ? TGBPASS / బిల్డ్ నౌ లో అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ అంతస్తులు నిర్మించడం. సెట్‌బ్యాంక్ ఉల్లంఘనలు అంటే స్థలాన్ని వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేస్తున్నారు. కమర్షియల్ మార్పులు అంటే నివాస భవనాలను వాణిజ్య సముదాయాలుగా మారుస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తుంటే తక్షణమే ఆ నిర్మాణంను ఆపితే యజమానికి నష్టం జరుగదు. లేకపోతే అట్టి అక్రమ నిర్మాణంను అడ్డుపెట్టుకొని అవినీతి GHMC అధికారులతో కుమ్మక్కై కొందరు ప్రజాప్రతినిధులు / రాజకీయ నాయకులు / మీడియా ప్రతినిధులు అక్రమ నిర్మాణ యజమాని వద్ద అక్రమంగా డబ్బులు తీసుకుంటుండ్రు అని నిత్యం ఫిర్యాదులు.వీళందరు కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆధాయానికి గండి కొడుతున్నారు.ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి, వ్యవస్థలకు తీరని నష్టం.మున్సిపల్ చట్టాలను, TGBPASS నిబంధనలు ఉల్లంగించి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు అని గతంలో కూడా "మీడియా టుడే" లో వార్త కథనాలు వచ్చాయి. అధికారులు చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. కానీ ఈరోజు వరకు ఎలాంటి చర్యలు లేవు అంటే అవినీతి కి పాల్పడుతున్న అంబర్పేట్ జిహెచ్ఎంసి అధికారులు అని క్లియర్ గా అర్ధం అవుతుంది. నిబంధనలను ఉల్లంఘించిన వాటిపై GHMC కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి భవనాలను సీజ్ చేస్తున్నాం అన్నారు కానీ ఆలా జరగడం లేదు.సీజ్ చేసిన భవనాలు పూర్తి కూడా అయి గృహప్రవేశం అయిన సందర్భాలు ఎన్నో.
రాజకీయ రక్షణ, ఉన్నతాధికారుల అండదండలు ఉండటం వల్లనే అవినీతి అధికారులు వందల కోట్ల అక్రమాస్తులను కూడబెట్టగలుగుతున్నారు.తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు అని అర్ధం అవుతుంది.ఇలాంటి అక్రమ నిర్మాణాల గురించి నిత్యం ప్రభుత్వ అధికారిక మాద్యమాలు అయిన ట్విట్టర్ / ఇంస్టాగ్రామ్ / ఫేస్ బుక్ ద్వారా సీఎం కమ్ పురపాలక శాఖ మంత్రివర్యులు రేవంత్ రెడ్డికి,తెలంగాణ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ముఖ్య కార్యదర్శికి,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (MA&UD & HMDA) జయేష్ రంజన్,IAS కు,జిహెచ్ఎంసి కమీషనర్ కు,సైబరాబాద్ కమిషనర్ కు, మల్కాజిగిరి కమీషనర్ కు, అన్ని జోనల్ కమిషనర్లకు కు, డిప్యుటీ కమీషనర్లకు వందల ఫిర్యాదులు.GHMC ట్విట్టర్ ఆన్లైన్ లో ఎన్నిసార్లు
ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటాం అని సమాధానం వస్తుంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు ? అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను గౌరవించరు ఎందుకు ?అక్రమ నిర్మాణాల ముందు అవి ‘నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలు’ అని తెలిసే విధంగా బోర్డులు పెట్టాలని హైకోర్టు గతంలో అభిప్రాయం వ్యక్తం చేసింది. అయినా అధికారులు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?.ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ అక్రమ నిర్మాణాల పై మౌనం వహిస్తే ఎట్లా ? అంబర్పేట్ సర్కిల్ లో చాలా అక్రమ నిర్మాణాల ఫిర్యాదులు ఉన్నాయి వీటిపై పూర్తిగా విచారణ జరిపించాలి... బాపట్ల కృష్ణమోహన్.
No comments:
Post a Comment