CJI NV Ramana: ఉచితాలపై సుప్రీం కోర్టులో విచారణ.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ (Delhi): రాజకీయ పార్టీల ఉచిత హామీల (Free guarantees)పై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సీజేఐ ఎన్‌వి రమణ (CJI NV Ramana) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉచితాలపై కేంద్ర ప్రభుత్వమే అఖిలపక్ష కమిటీని ఎందుకు వేయకూడదని ప్రశ్నించారు. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసే ఆసక్తిలో లేదని కేంద్రం తరపు న్యాయవాది తెలిపారు. ఎన్నికల్లో పార్టీలు ప్రజలకు రకరకాల హామీలు ఇస్తుంటాయని, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రేపు అధికారంలోకి రావచ్చునని ఎన్‌వి రమణ అన్నారు. అధికార పార్టీ ఆర్థిక అంశాల్లో చూసి వ్యవహరించాలని సూచించారు. పదవి కాలం ముగియబోతున్న జడ్జి వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యత ఉండదన్నారు. ఎన్నికల ఉచిత హామీల కేసును విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment