ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి కి తొలి పూజ చేసిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా భాగ్యనగరానికి ప్రత్యేకత తీసుకొచ్చిన 'ఖైరతాబాద్ గణేశ్' వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలి పూజ చేశారు. ఈ ఏడాది 'పంచముఖ మహాలక్ష్మి గణపతి'గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు.ప్రపంచవ్యాప్తంగా భాగ్యనగరానికి ప్రత్యేకత తీసుకొచ్చిన 'ఖైరతాబాద్ గణేశ్' వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలి పూజ చేశారు. ఈ ఏడాది 'పంచముఖ మహాలక్ష్మి గణపతి'గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు.
ఈసారి 50 అడుగులతో ఏర్పాటు చేసిన బడా గణేశ్‌ను మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దారు. వినాయకుడితో పాటు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, త్రిశక్తిగా పిలుచుకునే మహాగాయత్రిదేవీ కొలువుదీరారు. ఖైరతాబాద్ బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తు్న్నారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం
No comments:
Post a Comment