Thursday, August 18, 2022

ఎస్కలేటర్ దిగుతూ కింద పడిన విద్యార్థులు

*ఎస్కలేటర్ దిగుతూ కింద పడిన విద్యార్థులు*

*12 మంది పిల్లలు, ఓ ఉపాధ్యాయురాలికి గాయాలు*
*గాంధీ సినిమా ప్రదర్శిస్తున్న హైదరాబాద్‌ ఆర్‌కే సినీఫ్లెక్స్‌లో ఘటన*

జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రదర్శిస్తున్న 'గాంధీ' చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులు ఎస్కలేటర్‌ దిగుతూ పడిపోయి గాయపడిన ఘటన హైదరాబాద్‌లో కలకలానికి కారణమైంది. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలూ గాయపడ్డారు. జూబ్లీహిల్స్‌ భారతీయ విద్యా భవన్స్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు 'గాంధీ' చిత్రాన్ని వీక్షించేందుకు గురువారం ఉదయం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పీవీఆర్‌ ఆర్‌కె సినీఫ్లెక్స్‌కు వచ్చారు. ఎస్కలేటర్‌ ఎక్కి పైకి వెళ్లారు. దాన్నుంచి దిగే సమయంలో తరబాటుకు గురై 12 మంది విద్యార్థులు కిందపడి గాయపడ్డారు. వాళ్ల వెంట ఉన్న ఉపాధ్యాయురాలు కూడా గాయాలపాలయ్యారు. వారిని పాఠశాల సిబ్బంది జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఉపాధ్యాయురాలితోపాటు 8 మంది విద్యార్థులను డిశ్ఛార్జి చేసినట్లు, శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో నలుగుర్ని(అభినవ్‌, తరుణ్‌, హాసిని, క్రితిన్‌) ఆసుపత్రిలోనే ఉంచినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బాధిత విద్యార్థులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పరామర్శించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment