Friday, August 26, 2022

మోదీనే నెంబర్.... వన్

*మోదీనే నెంబర్.... వన్*

*ప్రపంచ అత్యుత్తమ నేతల్లో టాప్‌ : సర్వే వెల్లడి*
*5వ స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌*

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75 శాతం ప్రజామోదం ఉందని 'మార్నింగ్‌ కన్సల్ట్‌' అనే సర్వే సంస్థ వెల్లడించింది. ప్రపంచ నాయకులు అందరికంటే అధిక జనాదరణ ఉన్న నేతగా మోదీనే ముందున్నారని స్పష్టం చేసింది. మొత్తం 22 మంది దేశాధినేతల్లో మోదీ అత్యధిక రేటింగ్‌ సంపాదించుకున్నారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ చేపట్టిన సర్వేలో ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ 41 శాతం అప్రూవల్‌ రేటింగ్‌తో 5వ స్థానంలో నిలవడం గమనార్హం.

63 శాతం ఆమోదంతో రెండోస్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యువల్‌ లోపెజ్‌ ఒబ్రాడార్‌ ఉండగా, 54 శాతంతో మూడోస్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో 39 శాతం, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో.. అమెరికా అధ్యక్షుడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అమెరికా డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ 'మార్నింగ్‌ కన్సల్ట్‌' పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని అంచనా వేస్తుంటుంది. ఇంటెలిజెన్స్‌ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, దక్షిణ కొరియా, స్వీడన్‌ వంటి దేశాల్లోనూ ఈ సంస్థ సర్వే నిర్వహించింది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment