Monday, August 1, 2022

న్యాయవాది దారుణ హత్య


న్యాయవాది దారుణ హత్య

న్యాయవాది దారుణ హత్య
  • కాపు కాసి మట్టుపెట్టిన దుండగులు
  • సుపారి హత్యగా పోలీసుల అనుమానం
  • ములుగు జిల్లాలో తీవ్ర కలకలం

ములుగు, ఆగస్టు1(నమస్తే తెలంగాణ)/ములుగు రూరల్‌: భూ వివాదాలు, ఎర్రమట్టి మైనింగ్‌ వ్యవహారాలు ప్రముఖ న్యాయవాది, మైనింగ్‌ వ్యాపారి హత్యకు దారితీశాయి. సోమవారం రాత్రి జిల్లాకేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోజాతీయ రహదారిపై జరిగిన హత్యతో ములుగు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాలలోకి వెళితే… జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండకు చెందిన ప్రముఖ న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి (56) హనుమకొండలోని అడ్వకేట్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

ములుగు జిల్లా పరిధి మల్లంపల్లిలో ఎర్రమట్టి మైనింగ్‌ వ్యాపారం చేస్తూ అంచలంచెలుగా ఎదిగాడు. దీంతో పాటు శ్రీనగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద పెట్రోల్‌ బంక్‌ను సైతం నిర్వహిస్తూ మల్లంపల్లిలో సుమారు 280 ఎకరాల మైనింగ్‌ భూములకు యజమానిగా మారాడు. ఇదే క్రమంలో న్యాయవాదిగా హనుమకొండ, ములుగు కోర్టులలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

సోమవారం ములుగుకు వచ్చి తిరిగి తన వాహనంలో డ్రైవర్‌ సారంగంతో కలిసి హనుమకొండకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ములుగు దాటిన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికుంట క్రాస్‌ వద్ద కాపు కాసిన ఐదుగురు గుర్తుతెలియని దుండగులు కారు ఆపి మల్లారెడ్డిపై విచక్షణారహితంగా కత్తులతో నరికి హత్యచేశారు. అనంతరం కత్తిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.


No comments:

Post a Comment